NTV Telugu Site icon

Arvind Kejriwal’s Bail: ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌కు భారీ ఊరట.. సీబీఐ కేసులోనూ బెయిల్

Delhi Cm

Delhi Cm

Arvind Kejriwal’s Bail: మద్యం విధానానికి సంబంధించిన అవకతవకల వ్యవహారంలో ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌కు భారీ ఊరట దొరికింది. లిక్కర్ కుంభకోణం కేసులో ఎట్టకేలకు బెయిల్ లభించింది. ఈ మేరకు సుప్రీంకోర్టు ఇవాళ (శుక్రవారం) కీలక ఆదేశాలు జారీ చేసింది. దీంతో దాదాపు 6 నెలల తర్వాత ఆయన జైలు నుంచి రిలీజ్ కాబోతున్నారు. అరవింద్ కేజ్రీవాల్ అరెస్టు అక్రమం కాదని ఈ సందర్భంగా సుప్రీంకోర్టు కామెంట్స్ చేసింది. అయితే, న్యాయప్రక్రియలో సుదీర్ఘ కారాగారవాసం అంటే వ్యక్తి యొక్క స్వేచ్ఛను హరించడమేనని బెయిల్ మంజూరు చేసిన న్యాయమూర్తి జస్టిస్ భుయాన్ అన్నారు. ‘‘అరెస్టు చేసిన సమయంలో అనేక ప్రశ్నలు, సందేహాలను లేవనెత్తుతోంది. బెయిల్ పొందిన కేజ్రీవాల్‌ను నిరాశపర్చడం కోసమే అరెస్టు చేసినట్టుగా అనిపించింది అన్నారు.

Read Also: Terrorist Arrested: జమ్మూ కశ్మీర్లో ఉగ్రవాది సహాయకుడి అరెస్ట్.. భారీగా పేలుడు పదార్థాలు స్వాధీనం..

కాగా, ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో విచారణ తర్వాత జూన్ నెలలో ఆయనను సీబీఐ అధికారులు అరెస్ట్ చేశారు. ఈడీ కేసులో ఇప్పటికే ఆయనకు బెయిల్ వచ్చింది. దీంతో ఆయన జైలు నుంచి విడుదల కాబోతున్నారు. దాదాపు ఆరు నెలల జైలు శిక్ష అనభవించిన తర్వాత ఆయన బయటకు రానుండడంతో ఆప్ నేతలు, పార్టీ శ్రేణులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. లిక్కర్‌ కేసు గురించి మాట్లాడకూడదని కేజ్రీవాల్‌కు షరతు విధించిన సుప్రీంకోర్టు.