Site icon NTV Telugu

Supreme Court: ‘‘రిలేషన్‌షిప్ చెడిపోయిన తర్వాత రేప్ కేసులు’’.. సుప్రీం ఆందోళన..

Supreme Court

Supreme Court

Supreme Court:ఏకాభిప్రాయంతో ‘‘రిలేషన్‌షిప్’’ నడిపి, అది కాస్త చెడిపోయిన తర్వాత అత్యాచార కేసులు నమోదు చేయడంపై సుప్రీంకోర్టు మంగళవారం ఆందోళన వ్యక్తం చేసింది. ఇరువురు వివాహ సంబంధం లేకుండా, ఇష్టపూర్వకంగా సుదీర్ఘమైన శారీరక సంబంధం ఏకాభిప్రాయ సంబంధాన్ని సూచిస్తుంది. కొన్ని సందర్భాల్లో ఈ సంబంధాల్లో వివాదాలు చెలరేగి జంట విడిపోతున్నారు. ఇలాంటి సమయంలో సదరు వ్యక్తిపై మహిళలు అత్యాచారం కేసులు పెడుతున్నారు.

Read Also: INDIA Bloc: మహారాష్ట్ర ఫలితాలపై కోర్టుకు వెళ్లే యోచనలో ప్రతిపక్షం!

తాజాగా, రిలేషన్‌షిప్ చెడిపోయిన తర్వాత ఒక మహిళ వ్యక్తిపై అత్యాచారానికి సంబంధించిన ఎఫ్ఐఆర్ దాఖలు చేసింది. దీనిని రద్దు చేయాలని దాఖలైన పిటిషన్‌పై జస్టిస్ బీవీ నాగరత్న, ఎన్ కోటీశ్వర్ సింగ్‌లతో కూడి ధర్మాసనం విచారణ జరిపింది. ఇలాంటివి పెద్ద సంఖ్యలో కేసులు వస్తున్నాయని, న్యాయశాస్త్రాన్ని తప్పుగా, దురుద్దేశంతో ప్రయోగిస్తున్నారని, ఇది ఆందోళనకరమైన విషయమని ధర్మాసనం పేర్కొంది. వివాహం చేసుకుంటానని సంబధాన్ని ఏర్పరుచుకోవడం, ఏకాభిప్రాయ సంబంధాల మధ్య తేడాను కోరింది.

వివాహ నిబద్ధత లేకుండా వ్యక్తిగత ప్రేమతో ఒక మహిళా భాగస్వామి, పురుషుడితో శారీరక సంబంధాన్ని కొనసాగించవచ్చని పేర్కొంది. ఒక మహిళ వివాహానికి పట్టుబట్టకుండా, పురుషుడితో సుదీర్ఘ శారీరక సంబంధం ఏకాభిప్రాయ సంబంధాన్ని చూపిస్తుందని, ఇది పెళ్లి పేరుతో తప్పుడు హామీ ఇచ్చి సంబంధం పెట్టుకోవడం కన్నా ఏకాభిప్రాయ సంబంధాన్నే కలిగి ఉంటుందనే అభిప్రాయాన్ని వెల్లడించింది.

Exit mobile version