NTV Telugu Site icon

Supreme Court: సుప్రీంకోర్టులో టెలికాం కంపెనీలకు షాక్..

Supreme Court

Supreme Court

Supreme Court: తమ అడ్జెస్టెడ్‌ గ్రాస్‌ రెవెన్యూ (ఏజీఆర్‌) బకాయిలపై సుప్రీంకోర్టు నిర్ణయాన్ని పునర్ విచారించాలంటూ టెలికాం కంపెనీలు దాఖలు చేసిన పిటిషన్‌ను ఈరోజు కొట్టేసింది. వొడాఫోన్‌ ఐడియా, భారతీ ఎయిర్‌టెల్‌ ఇతర కంపెనీలు 2019లో అత్యున్నత న్యాయస్థానం ఇచ్చిన ఆదేశాలపై గతేడాది క్యూరేటివ్‌ పిటిషన్‌ ఫైల్ చేశాయి. దీనిపై ఓపెన్‌ కోర్టులో నిర్ణయం ప్రకటించాలని వేడుకున్నాయి. టెలికామ్‌ డిపార్ట్‌మెంట్‌ (డీవోటీ) ఏజీఆర్‌ బకాయిల గణనలో భారీ తప్పిదం చోటు చేసుకొందని కంపెనీలు వాదనలు వినిపించాయి. తమ పిటిషన్‌ను ఓపెన్‌ కోర్టులో ఎంక్వైరీ చేయాలని.. ఎయిర్‌టెల్‌, ఒడాఫోన్‌ గతేడాది కోర్టును కోరాయి.

Read Also: Sankranthi 2025 : సీనియర్ హీరోలకు పోటీగా.. సంక్రాంతి బరిలో యంగ్ హీరో..

ఈ ఏజీఆర్‌ ఛార్జీలు ప్రభుత్వం- కంపెనీలు ఆదాయం పెంచుకునే విధానంలో ఉన్నాయని తెలిపాయి. దీని కిందే లైసెన్సింగ్‌ ఫీజులు, స్పెక్ట్రమ్‌ వినియోగ ఫీజలు చెల్లిస్తాయని పేర్కొన్నాయి. కానీ, డీవోటీ మాత్రం ఏజీఆర్‌లో శాతాలుగా గణించాయని చెప్తున్నాయి. 2005 నుంచి ఏజీఆర్‌ అనేది ఇబ్బందికర అంశంగానే మారిందని ఐడీయా- ఎయిర్ టెల్ కంపెనీలు పేర్కొన్నాయి.

Read Also: Soybeans: వామ్మో.. సోయాబీన్స్‭లో ఇంత మ్యాటర్ ఉందా..?

ఇక, తాజాగా దాఖలైన క్యూరేటివ్‌ పిటిషన్‌ ను సీజేఐ డీవై చంద్రచూడ్‌, జస్టిస్‌ సంజీవ్‌కుమార్‌, జస్టిస్‌ బీఆర్‌ గవయ్‌లతో కూడిన త్రిసభ్య ధర్మాసనం వద్ద లిస్టైంది. కానీ, దీనిని ఈరోజు న్యాయస్థానం కొట్టేసింది. సాధారణంగా ఇలాంటి పిటిషన్లను న్యాయమూర్తులు ఛాంబర్‌లో పరిశీలించి విచారణకు అర్హత ఉందో లేదో నిర్ణయిస్తారు. ప్రత్యేకమైన అభ్యర్థనలు ఉంటేనే ఓపెన్‌ కోర్టు విచారణను పర్మిషన్ ఇస్తారని న్యాయ నిపుణులు చెప్తున్నారు. తాజాగా సుప్రీంకోర్టు నిర్ణయం వెలువడటంతో వొడాఫోన్‌ ఐడియా షేర్లు 10 శాతానికి పైగా పడిపోయాయి.

Show comments