దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన కోల్‌కతా ఆర్జీకర్ ఆస్పత్రిలో వైద్యురాలి అత్యాచార ఘటనలో బాధిత తల్లిదండ్రులకు దేశ సర్వోన్నత న్యాయస్థానంలో చుక్కెదురైంది. ఇటీవలే నిందితుడు సంజయ్ రాయ్‌కు కోల్‌కతా ప్రత్యేక కోర్టు జీవిత ఖైదీ విధించింది. అయితే ఈ కేసును మళ్లీ సీబీఐతో విచారణ జరిపించాలని బాధిత తల్లిదండ్రులు సుప్రీం ధర్మాసనాన్ని ఆశ్రయించారు. సోమవారం న్యాయస్థానం ఈ పిటిషన్‌ను కొట్టేసింది. అయితే కోల్‌కతా హైకోర్టులో మాత్రం ఈ పిటిషన్‌ను కొనసాగించాలని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి సంజీవ్ ఖన్నా.. మృతురాలి పేరెంట్స్‌కు సూచించారు.
ఇది కూడా చదవండి: Phone: స్మార్ట్‌ఫోన్ వాడకుంటే.. పరిశోధనలో ఏం తేలింది తెలుసా !
2024, ఆగస్టు 9న కోల్‌కతా ఆర్జీకర్ ఆస్పత్రిలో నైట్‌డ్యూటీలో ఉండగా జూనియర్ వైద్యురాలిపై సివిల్ వాలంటీర్ సంజయ్ రాయ్ అఘాయిత్యానికి పాల్పడి చంపేశాడు. ఈ ఘటన దేశాన్ని కుదిపేసింది. ఇక పోలీసులు కేసు నమోదు చేసి సంజయ్ రాయ్‌ను అరెస్ట్ చేశారు. ఇటీవలే నిందితుడికి జీవిత ఖైదీ పడింది. అయితే నిందితుడికి మరణశిక్ష విధించాలని పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం కోల్‌కతా హైకోర్టును ఆశ్రయించింది. ఈ పిటిషన్ స్వీకరించేందుకు న్యాయస్థానం నిరాకరించింది. అయితే ఈ విషయంలో తమకే హక్కు ఉందని సీబీఐ పేర్కొంది. నిందితుడికి మరణశిక్ష పడేలా తామే కోరతామని సీబీఐ తెలిపింది. సీబీఐ అప్పీల్‌ను మాత్రం కోర్టు అంగీకరించింది. తాజాగా మృతురాలి తల్లిదండ్రులకు కూడా హైకోర్టులోనే చూసుకోవాలని సుప్రీంకోర్టు సూచించింది.
ఇది కూడా చదవండి: Orry: చిక్కుల్లో ఓర్రీ.. వైష్ణో దేవి ఆలయం దగ్గర మద్యం సేవించడంపై ఎఫ్ఐఆర్