NTV Telugu Site icon

Supreme Court: ‘‘అమ్మాయిలు మీ లైంగిక కోరికల్ని నియంత్రించుకోండి’’.. హైకోర్టు తీర్పుని కొట్టేసిన సుప్రీంకోర్టు..

Supreme Court 1

Supreme Court 1

Supreme Court: లైంగిక వేధింపుల కేసులో నిందితుడిని నిర్దోషిగా ప్రకటిస్తూ విడుదల చేస్తూ కలకత్తా హైకోర్టు ఇచ్చిన తీర్పుని సుప్రీంకోర్టు కొట్టేసింది. గతేడాది ఈ కేసులో యుక్తవయసులోని బాలికను ‘లైంగిక ప్రేరేపణలను నియంత్రించుకోవాలి’’ అని అభ్యంతరకరమైన వ్యాఖ్యలు చేయడం సంచలనంగా మారింది. ఈ కేసుని న్యాయమూర్తులు అభయ్ ఎస్ ఓకా, ఉజ్జల్ భుయాన్‌లతో కూడిన ధర్మాసనం విచారించింది. లైంగిక నేరాల నుంచి బాలల రక్షణ(పోక్సో) చట్టం కింద నమోదయ్యే కేసుల నిర్వహణపై అధికారులకు పలు ఆదేశాలు జారీ చేసినట్లు న్యాయమూర్తులు తెలిపారు. తీర్పుల ఎలా రాయాలనే దానిపై కూడా ఆదేశాలు జారీ చేశామన్నారు.

గతేడాది డిసెంబర్‌ 8న అత్యున్నత న్యాయస్థానం, హైకోర్టు చేసిన వ్యాఖ్యల్ని విమర్శించింది. ఇవి పూర్తిగా అభ్యంతరకరమైనవి, అసంబద్ధమైనవిగా పేర్కొంది. హైకోర్టు డివిజన్ బెంచ్ చేసిన కొన్ని పరిశీలనలను సుప్రీంకోర్టు పరిగణలోకి తీసుకుంది. న్యాయమూర్తులు తీర్పులు రాసేటప్పుడు ‘‘బోధించకూడదు’’ అని స్వయంగా సుప్రీంకోర్టు రిట్ పిటిషన్ ప్రారంభించింది. పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం అక్టోబర్ 18, 2023 నాటి ఈ హైకోర్టు తీర్పును సవాల్ చేసింది.

Read Also: Janhvi Kapoor: నువ్వేందిరా సామీ.. జాన్వీ కపూర్‌తో రాఖీ కట్టించుకున్నావ్! వీడియో వైరల్

అసలేంటి కేసు..? హైకోర్టు ఏం చెప్పింది..?

గతేడాది పోక్సో కేసుని హైకోర్టు న్యాయమూర్తులు చిత్త రంజన్ దాస్, పార్థసారధి సేన్‌లతో కూడిన డివిజన్ బెంజ్ విచారణ జరిపింది. మైనర్ బాలికపై అత్యాచారానికి పాల్పడిన యువకుడిపై పోక్సో కేసు నమోదైంది. విచారణలో అమ్మాయి, అబ్బాయి ప్రేమించుకున్నట్లు తేలింది. ఇద్దరి మధ్య ప్రేమ సంబంధం ఉందనే కారణంగా బాలికపై అత్యాచారం చేసినప్పటికీ యువకుడిని నిర్దోషిగా విడుదల చేసింది. పరస్పర సమ్మతితో సెక్స్ లో పాల్గొనే కేసుల్లో పోక్సో చట్టంపై ఆందోళన వ్యక్తం చేసింది. అబ్బాయిలు, అమ్మాయిలకు పలు సూచనలు చేసింది.

యుక్త వయసులో బాలికను తమ లైంగిక కోరికను నియంత్రించుకోవాలని సూచించింది. రెండు నిమిషాల ఆనందం కోసం లొంగిపోతే సమాజంలో ఆమె విలువను కోల్పోతోందని, ఆమె శరీరం యొక్క సమగ్రతను ఆమె హక్కును రక్షించాలని, ఆమె గౌరవాన్ని స్వీయ విలువను రక్షించాలని, ఆమె గోప్యతను రక్షించుకోవాలని సూచించింది. అబ్బాయిలు స్త్రీల విధుల్ని గౌరవించాలని, ఇలాంటి విషయాల్లో పిల్లల తల్లిదండ్రులే మొదటి ఉపాధ్యాయులుగా ఉండాలి, మంచి-చెడుల గురించి చెప్పాలని, సెక్స్ ఎడ్యుకేషన్ ప్రాధాన్యతను గురించి నొక్కి చెప్పింది. మగపిల్లలకు తల్లిదండ్రులు మహిళలను ఎలా గౌరవించాలో చెప్పాలని, లైంగిక కోరికతో ప్రేరేపించబడకుండా మహిళలతో ఎలా స్నేహం చేయాలో చెప్పాలని హైకోర్టు సూచించింది.

Show comments