NTV Telugu Site icon

Supreme Court: తిరుపతి ప్రత్యేక రాష్ట్రం కోసం పిటిషన్.. సుప్రీంకోర్టు తిరస్కరణ

Supremecourt

Supremecourt

ఆంధ్రప్రదేశ్‌లోని తిరుపతిని ప్రత్యేక రాష్ట్రం లేదా కేంద్ర పాలిత ప్రాంతంగా ప్రకటించాలని కోరుతూ ప్రజాశాంతి పార్టీ అధినేత కేఏ.పాల్ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. కేవలం 700 మందికిపైగా ఉన్న ప్రజల కోసం వాటికన్ సిటీ దేశంగా ఉందంటూ ఉదాహరణ చూపుతూ.. అంతకంటే ఎక్కువ జనాభా ఉన్న తిరుపతిని కూడా ఒక ప్రత్యేక రాష్ట్రంగా గుర్తించాలని పిటిషన్‌లో కేఏ.పాల్ కోరారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రతిష్టతను కాపాడేందుకే ఈ పిటిషన్ వేసినట్లు పేర్కొన్నారు. పిటిషన్‌ను వ్యక్తిగతంగా కేఏ.పాల్ వాదించారు. అయినా కూడా సుప్రీం ధర్మాసనం పిటిషన్ కొట్టేసింది.

ఇది కూడా చదవండి: Devaki Nandana Vasudeva: వెనక్కి తగ్గిన ‘దేవకీ నందన వాసుదేవ’

తిరుపతిని ప్రత్యేక రాష్ట్రం చేస్తే.. దేశంలో ఉన్న ఇతర దేవాలయాల కోసం కూడా ఒక్కో రాష్ట్రాన్ని కేటాయించాల్సి ఉంటుందని.. జగన్నాథ్ పూరి కోసం, కేదార్‌నాథ్ కోసం, బద్రీనాథ్ కోసం, మదురై దేవాలయం కోసం, రామేశ్వరం దేవాలయం కోసం ప్రత్యేక రాష్ట్రం కావాలి.’’ అని డిమాండ్ వస్తుందని జస్టిస్ బీఆర్ గవాయ్, కేవీ. విశ్వనాథన్‌లతో కూడిన సుప్రీంకోర్టు ధర్మాసనం పేర్కొంది. ఒక్కో దేవాలయం కోసం రాష్ట్రంగా పరిగణించడం కుదరదని న్యాయస్థానం స్పష్టం చేసింది. దీంతో పిటిషన్‌ను కొట్టేసింది. అలాగే తిరుపతి లడ్డూ వివాదంపై దాఖలైన పిటిషన్‌ను కూడా శుక్రవారం సుప్రీంకోర్టు కొట్టివేసింది. తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ), సీబీఐ వ్యతిరేకంగా ఆయన పిటిషన్ వేశారు. సిట్ నివేదిక టైమ్‌లైన్‌కు సంబంధించి ఎలాంటి ఆదేశాలు ఇవ్వడానికి కూడా కోర్టు నిరాకరించింది.

ఇది కూడా చదవండి: Rain Alert: ఈ నెల 12,13, 14 తేదీల్లో రాయలసీమ, దక్షిణకోస్తాలో మోస్తరు వర్షాలు!