Supreme Court: ఢిల్లీ వాసులకు సుప్రీంకోర్టు శుభవార్త.. గ్రీన్ క్రాకర్ల వాడకానికి అనుమతి
- ఢిల్లీ వాసులకు సుప్రీంకోర్టు శుభవార్త
- గ్రీన్ క్రాకర్ల వాడకానికి అనుమతి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
దేశ రాజధాని ఢిల్లీ వాసులకు సుప్రీంకోర్టు దీపావళి శుభవార్త చెప్పింది. గ్రీన్ క్రాకర్స్ అమ్మకాలు, వాడకంపై అనుమతిస్తూ కీలక తీర్పు వెలువరించింది. అక్టోబర్ 18 నుంచి 21 వరకు గ్రీన్ క్రాకర్స్ అమ్మకం, పేల్చడానికి అనుమతి ఉంటుందని భారత ప్రధాన న్యాయమూర్తి బీఆర్. గవాయ్, జస్టిస్ కె వినోద్ చంద్రన్లతో కూడిన ధర్మాసనం తీర్పు ఇచ్చింది.
ఇది కూడా చదవండి: Maharashtra: సీఎం ఫడ్నవిస్ ఎదుట లొంగిపోయిన మల్లోజుల.. ఆయుధాలు అందజేత
Also Read
- Tamil Nadu Budget 2026: జెన్-జెడ్ విద్యార్థులపై ప్రభుత్వం వరాల జల్లు.. గోల్డ్ కాయిన్స్, పట్టు చీరలు, సైకిళ్ల పంపిణీ..!
- PM Modi: "మార్క్ జుకర్‌బర్గ్ ప్రధాని మోడీకి క్షమాపణ చెప్పాలి, లేకపోతే..." మెటా సీఈఓకు పార్లమెంటరీ ప్యానెల్ అల్టిమేటం?
- Terror Modules: జంతర్ మంతర్ నిరసనల్లో టెర్రరిస్ట్‌లు.. 9 మంది పాకిస్థాన్ ఐఎస్ఐ ఉగ్రవాదులు అరెస్ట్
- Udhayanidhi Stalin: తంబీ..ఇంతలా దిగజారాలా? ఉదయనిధి నోటికి ఎంత వస్తే అంత మాట్లాడేస్తాడా..?
పొల్యూషన్ కారణంగా బాణాసంచా కాల్చడంపై 2018 నుంచి ఢిల్లీలో నిషేధం ఉంది. దీంతో బాణాసంచా కాల్చుకునేందుకు అనుమతి ఇవ్వాలంటూ పిటిషన్లు దాఖలయ్యాయి. బుధవారం పిటిషన్లు విచారించిన గవాయ్.. కీలక తీర్పు వెలువరించారు. అక్టోబర్ 18 నుంచి అక్టోబర్ 21 వరకు గ్రీన్ క్రాకర్లు అమ్ముకునేందుకు.. కాల్చేందుకు అనుమతి ఇచ్చింది. బాణసంచా పేల్చడం సాయంత్రం 6 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు మాత్రమే పరిమితం చేయాలని కోర్టు ఆదేశించింది.
ఇది కూడా చదవండి: Ravi Naik: గోవా మాజీ ముఖ్యమంత్రి రవి నాయక్ కన్నుమూత.. మోడీ సంతాపం
ప్రాంతీయ పండుగలకు అనుగుణంగా సమయాలను సర్దుబాటు చేసి, నియమించబడిన ప్రాంతాల్లో మాత్రమే బాణసంచా కాల్చుకోవాలని తెలిపింది. క్యూఆర్ కోడ్‌లతో ఉన్న గ్రీన్ క్రాకర్లే అమ్మేలా పెట్రోలింగ్ నిర్వహించాలని తెలిపింది. ఈ మేరకు పోలీసులకు సూచించింది. చట్టాన్ని ఉల్లంఘించిన వారికి నోటీసులు ఇవ్వాలని ఆదేశించింది. ఆన్‌లైన్ అమ్మకాలను నిషేధించాలని తెలిపింది.
ఆదేశాలు ఇవే..
NEERI, PESO ఆమోదించిన గ్రీన్ క్రాకర్లను మాత్రమే అనుమతించాలి.
లైసెన్స్ పొందిన వ్యాపారులు, తయారీదారుల ద్వారా అమ్మకాలు నిర్వహించాలి.
బేరియం, లిథియం, ఆర్సెనిక్, యాంటిమోనీ, సీసం, పాదరసం వంటి రసాయన పరిమితులకు అనుగుణంగా తనిఖీలు నిర్వహించాలి.
ప్రాంతీయ పండుగలకు సమయాలను సర్దుబాటు చేసి.. నియమించబడిన ప్రాంతాల్లో మాత్రమే ఉపయోగించాలి
అనధికార ఉత్పత్తిపై లైసెన్స్ సస్పెన్షన్, తయారీ యూనిట్లను స్వాధీనం చేసుకోవడంతో సహా కఠినమైన చర్యలు తీసుకోవాలి.
రేఖా గుప్తా స్వాగతం..
సుప్రీంకోర్టు తీర్పును ముఖ్యమంత్రి రేఖా గుప్తా స్వాగతించారు. ‘‘ఢిల్లీ ప్రభుత్వ ప్రత్యేక అభ్యర్థన మేరకు రాజధానిలో ఆకుపచ్చ బాణసంచా కాల్చడానికి అనుమతి ఇచ్చినందుకు గౌరవనీయ సుప్రీంకోర్టుకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. ఈ నిర్ణయం దీపావళి వంటి పవిత్ర పండుగల సమయంలో ప్రజల మనోభావాలను, ఉత్సాహాన్ని గౌరవిస్తుంది. అదే సమయంలో పర్యావరణ పరిరక్షణ పట్ల సమతుల్య విధానాన్ని ప్రతిబింబిస్తుంది.’’ అని రేఖా గుప్తా పేర్కొన్నారు.
दिल्ली सरकार के विशेष आग्रह पर राजधानी में ग्रीन पटाखों के उपयोग की अनुमति प्रदान करने हेतु माननीय सर्वोच्च न्यायालय का आभार।
यह निर्णय दीपावली जैसे पवित्र पर्व पर जनभावनाओं और उत्साह का सम्मान करता है, साथ ही पर्यावरण संरक्षण के प्रति संतुलित दृष्टिकोण को दर्शाता है।
दिल्ली…
— Rekha Gupta (@gupta_rekha) October 15, 2025
తాజావార్తలు
-
Tragedy News: స్నేహం, పెళ్లి, కోపం.. చివరికి నదిలోకి తోసి ప్రాణాలు తీసిన యువకుడు!
-
Aqua Farmers: ఆక్వా రైతులకు ఊరట.. రూ.1.50కే విద్యుత్ సరఫరా!
-
AI పవర్‌తో iQOO Z11 ఎంట్రీ.. కొత్త డిజైన్, స్మార్ట్ ఫీచర్లపై క్లారిటీ ఇచ్చిన కంపెనీ.!
-
boltt Ace 5G, Evo 4G డిజైన్ రివీల్.. ఆగస్టు 25న భారత్‌లో లాంచ్‌కు సిద్ధం..!
-
Tejaswini Nandamuri : బాలయ్య కూతురిని డైరెక్ట్ చేయబోయే దర్శకురాలు ఎవరంటే?
ట్రెండింగ్
-
TVS Raider Doctor Doom Edition లాంచ్.. Marvel థీమ్, Spectral Green కలర్‌తో కొత్త స్టైల్..!
-
115 అంగుళాల Mini LED TV, OLED evo, Micro RGB evoతో LG 2026 AI TV సిరీస్ భారత్‌లో లాంచ్..!
-
VVS Laxman Chief Selector: అజిత్ అగార్కర్‌కు బిగ్ షాక్.. బీసీసీఐ చీఫ్ సెలెక్టర్‌గా వీవీఎస్ లక్ష్మణ్?
-
Yamaha R15, MT-15 MotoGP ఎడిషన్ బైక్స్ మళ్లీ వచ్చేశాయి.. కొత్త కలర్ ఆప్షన్లతో FZ-S సిరీస్ కూడా అప్డేట్..!
-
కేవలం 50 మాత్రమే.. లగ్జరీతో పాటు ఫ్యాషన్ టచ్..! MG Cyberster, M9 Couture Edition కార్లు లాంచ్.!