Site icon NTV Telugu

Supermoon 2026: జనవరి 3న పెద్దగా కనిపించనున్న చంద్రుడు.. దీనికి కారణం ఇదే..

Supermoon

Supermoon

Supermoon 2026: కొత్త ఏడాది 2026 మొదలైన మూడు రోజులకే అంతరిక్షంలో తొలి అద్భుతం కనిపించబోతోంది. జనవరి 3న ‘‘వోల్ఫ్ మూన్’’గా పిలిచే ‘‘సూపర్ మూన్’’ దర్శనమివ్వబోతోంది. పౌర్ణమి చంద్రుడు సాధారణం కన్నా చాలా ప్రకాశవంతంగా, పెద్దగా కనువిందు చేయనున్నాడు. చంద్రుడు భూమికి దగ్గరగా రావడం వల్ల సూపర్ మూన్ ఏర్పడుతుంది.

Read Also: AP Liquor Sales: రూ.2,767 కోట్ల అమ్మకాలు.. లిక్కర్ సేల్స్‌కు ప్రధాన కారణాలు ఇవే!

చంద్రుడి కక్ష్య వృత్తాకారంలో కాకుండా దీర్ఘవృత్తాకారంలో ఉంటుంది. దీంతో కొన్ని సమయాల్లో చంద్రుడు భూమికి దగ్గరగా వస్తాడు. కొన్ని సమయాల్లో భూమికి దగ్గరగా (పెరిజీ), మరికొన్ని సమయాల్లో దూరంగా (అపోజీ) ఉంటాడు. పౌర్ణమి రోజు చంద్రుడు భూమికి అత్యంత దగ్గరగా ఉన్నప్పుడు కనిపించేదే సూపర్‌మూన్‌గా వ్యవరిస్తుంటాం. జనవరి 3న చంద్రుడు భూమికి సుమారుగా 3,56,500 కిలోమీటర్ల దూరంలో ఉంటాడు. దీని వల్ల సాధారణం కన్నా 14శాతం పెద్దగా, 30శాతం ఎక్కువ ప్రకాశవంతంగా కనిపిస్తాడు. భూమి, చంద్రుడి మధ్య సరాసరి దూరం సుమారు 3,84,400 కిలోమీటర్లు. పెరీజీ సమయంలో 3,56,500 కిలోమీటర్లు, అపోజీ సమయంలో 4,06,700 కిలోమీటర్లు దూరం ఉంటుంది.

2026లో జరిగే సంఘటనకు మరో ప్రత్యేకత ఉంది. ఇది పెరిహెలియన్, అంటే భూమి సూర్యునికి అత్యంత దగ్గరగా ఉండే బిందువుతో ఏకీభిస్తుంది. ఈ సమయంలో పెరిజియన్ స్ప్రింగ్ అలలు కొద్దిగా ఎక్కువగా ఉంటాయి. తీర ప్రాంతాల్లోని ప్రజలు సముద్ర అలలు పెద్దవిగా ఉండటం గమనించవచ్చు. జనవరి 3న ప్రకాశవంతమైన చంద్రుడిని చూసేందుకు అత్యుత్తమ సమయం సాయంత్రం 5 గంటల 45 నిమిషాలు.

Exit mobile version