NTV Telugu Site icon

Super Visa: కెనడాలో ఉంటున్న వారికి గుడ్ న్యూస్.. తల్లిదండ్రులతో నివాసం ఇక సులువు..

Canada Super Visa

Canada Super Visa

Super Visa: కెనడాలో ఉంటున్న భారతీయులతో పాటు అక్కడ స్థిరనివాసం ఏర్పరుచుకున్నవారికి గుడ్ న్యూస్ చెప్పింది అక్కడి ప్రభుత్వం. కెనడాలో ఉంటున్న వారు ఇకపై తమ తల్లిదండ్రులతో ఎక్కువ రోజులు గడిపేలా సూపర్ వీసా నిబంధనల్లో మార్పులు చేసింది. ఇమ్మిగ్రేషన్, శరణార్థుల పౌరసత్వ మంత్రిత్వ శాఖ, ప్రజా భద్రత మంత్రిత్వ శాఖల ఆదేశాల మేరకు కొత్త నిబంధనలు ఈ ఏడాది సెప్టెంబర్ 15 నుంచి అమలులోకి వచ్చాయి.

కెనడాలో స్థిర నివాసం ఏర్పరుచుకున్న వ్యక్తులు, కెనడా పౌరుల తల్లిదండ్రులు, నానమ్మ, తాతయ్యలు తాత్కాలికంగా కెనడాలో నివసించేందుకు ఈ సూపర్ వీసా ఉపయోగపడనుంది. ఈ వీసాతో 10 ఏళ్ల పాటు తమ పిల్లలు, మనవళ్లతో వారు కెనడాలో నివాసం ఉండొచ్చు. అనేక సార్లు కెనడా వచ్చీ వెళ్లొచ్చు. గతంలో ఈ అవకాశం ఒకసారి ప్రవేశానికి కేవలం 2 ఏళ్లు మాత్రమే గరిష్టంగా నివాసం ఉండే వీలుండేది. ప్రస్తుతం దీన్ని 10 ఏళ్లకు పెంచారు.

Read Also: IMEEC: ఇండియా-మిడిల్ ఈస్ట్-యూరప్ ఎకనామిక్ కారిడార్‌పై ఇజ్రాయిల్-హమాస్ యుద్ధం ప్రభావం చూపిస్తుందా..?

సాధారణంగా విజిటర్ వీసా మీద వస్తే గరిష్టంగా ఆరు నెలలు మాత్రమే నివాసం ఉండేందుకు వీలుండేది. ఎక్కువ కాలం పాటు ఉండాలంటే వీసాను పొడగించుకోవాలి. వీటికి ఫీజులు చెల్లించాలి. ఇదంతా లేకుండా ఇప్పుడు ఎక్కువ కాలం ఉండేందుకు ఈ సూపర్ వీసా ఉపయోగపడుతుంది. కెనడాలో ఉండే వ్యక్తులు వారి తల్లిదండ్రుల్ని, గ్రాండ్ పేరెంట్స్ ని ఆహ్మానించవచ్చు. అయితే దీనికి ముందు సదరు వ్యక్తికి వారిని పోషించే స్తోమత ఉందని ఆదాయ ధ్రువీకరణ పత్రాలను చూపించాల్సి ఉంటుంది. కెనడాలో ఉండే వారికి హెల్త్ ఇన్సూరెన్స్ తప్పనిసరి.