Sukesh Chandrashekhar: అవినీతి, మనిలాండరింగ్ కేసుల్లో సుకేష్ చంద్రశేఖర్ ను ఈడీ అరెస్ట్ చేసిన విషయం తెలిసింది. అతను అక్కడ నుంచి ఆప్ పార్టీ, సీఎం కేజ్రీవాల్ టార్గెట్ గా పలు ఆరోపణలు చేశారు. మరోవైపు తన ప్రియురాలు, బాలీవుడ్ నటి జాక్వలిన్ ఫెర్నాండెస్ కు ప్రేమ లేఖలు కూడా రాస్తూ వార్తల్లో నిలుస్తున్నారు. ఇదిలా ఉంటే మరోసారి వార్తల్లో వ్యక్తిగా మారారు సుకేష్ చంద్రశేఖర్. ఇటీవల ఒడిశాలో జరిగిన రైలు ప్రమాదంలో బాధితుల కోసం ఏకంగా రూ.10 కోట్లను విరాళంగా ఇస్తున్నట్లు ప్రకటించారు.
Read Also: Ukraine War: పుతిన్ చర్చలకు సిద్ధంగా ఉన్నారు.. కీలక ప్రకటన చేసిన క్రెమ్లిన్..
విరాళానికి సంబంధించి తనకు అనుమతి ఇవ్వాలని కోరుతూ.. రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ కి లేక రాశారు. తాను ఇవ్వాలనుకుంటున్న రూ. 10 కోట్లు తన వ్యక్తిగత నిధి నుంచి, చట్టబద్ధంగా సంపాదించిన దాని నుంచి ఇస్తున్నట్లు లేఖలో పేర్కొన్నాడు. ప్రమాదంలో తల్లిదండ్రులను కోల్పోయిన పిల్లల చదువుల కోసం ఈ నిధిని ఉపయోగించాల్సిందిగా కోరాడు. ఒక బాధ్యతాయుతమైన మరియు మంచి పౌరుడిగా, ఈ రూ. 10 కోట్ల నిధిని బాధిత కుటుంబాల పిల్లల విద్య కోసం ఇస్తున్నానని ఆయన లేఖలో పేర్కొన్నాడు. సర్వత చర్యలు తీసుకున్నందుకు ప్రధాని నరేంద్రమోడీని, రైల్వే శాఖను ప్రశంసించారు. సుకేష్ తన సంస్థ శారదా ఫౌండేషన్, చంద్రశేఖర్ క్యాన్సర్ ఫౌండేషన్, ఎల్‌ఎస్ ఎడ్యుకేషన్, దేశంలోని దక్షిణాది రాష్ట్రాల్లో వివిధ రంగాలకు తమ వంతు సహాయాన్ని అందిస్తున్నారని పేర్కొన్నారు.
ఈ నెల ఒడిశాలోని బాలాసోర్ వద్ద మూడు రైళ్లు ఢీకొనడంతో పెద్ద ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఇప్పటి వరకు 288 మంది మరణించారు. 1200 మందికి పైగా గాయపడ్డారు. ప్రస్తుతం ఈ ప్రమాదంపై సీబీఐ ఇన్వెస్టిగేషన్ చేస్తోంది. రాజకీయ నాయకులు, ప్రముఖులు, వ్యాపారవేత్తల నుంచి సుకేష్ చంద్రశేఖర్ డబ్బులు వసూలు చేశాడు. మాజీ ఫార్మా కంపెనీ రాన్‌బాక్సీ యజమాని శివిందర్ మోహన్ సింగ్ భార్య అదితి సింగ్‌ను రూ.200 కోట్లు మోసం చేశాడు. మనీలాండరింగ్ కు పాల్పడినందుకు ఈడీ సుకేష్ ని అరెస్ట్ చేసింది. ఈ కేసులో బాలీవుడ్ నటి జాక్వెలిన్ ఫెర్నాండెస్ కూడా నిందితురాలిగా ఉన్నారు.