NTV Telugu Site icon

Jacqueline Fernandez: అతడు నా కెరీర్‌ని నాశనం చేశాడు.. జాక్వెలిన్ ఆవేదన

Jaqueline Fernandez

Jaqueline Fernandez

Sukesh Chandrashekhar Ruined My Career Says Jacqueline Fernandez: సుకేశ్ చంద్రశేఖర్ మనీలాండరింగ్ కేసు వెలుగుచూసినప్పటి నుంచి.. బాలీవుడ్ నటి జాక్వెలిన్ ఫెర్నాండెజ్ పేరు మీడియాలో మార్మోగుతూనే ఉంది. ఆమె వ్యక్తిగత జీవితానికి సంబంధించి ఎన్నో రహస్యాలు బయటపడ్డాయి. సుకేశ్‌తో అత్యంత సన్నిహితంగా ఉన్న ఫోటోలూ బయటకు వచ్చాయి. ఇన్నాళ్లూ ఈ మనీలాండరింగ్ కేసు విషయంలో పెద్దగా నోరు విప్పని జాక్వెలిన్.. తాజాగా సంచలన వ్యాఖ్యలు చేసింది. కోర్టుకు సమర్పించిన వాంగ్మూలంలో కీలక విషయాలు వెల్లడించింది. సుకేశ్ తన కెరీర్‌ని నాశనం చేశాడని, తన భావోద్వేగాలతో అతడు ఆడుకున్నాడని ఆవేదన వ్యక్తం చేసింది. సుకేశ్ ఓ మోసగాడని.. అతని తప్పుల్ని తాను గుర్తించలేకపోయానని వాపోయింది. తనని నయవంచనకు గురి చేసి, తప్పుదారి పట్టించాడని పేర్కొంది. ఈ కేసులో తనపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని తెలిపింది.

Viral Video: పెళ్లి వేడుకల్లో అపశృతి.. డ్యాన్స్‌ చేస్తూనే కుప్పకూలిన యువకుడు

పింకీ ఇరానీ అనే మహిళ సుకేశ్‌ని ఒక ప్రభుత్వ అధికారిగా తనని పరిచయం చేసింది జాక్వెలిన్ చెప్పింది. మొదట్లో తాను పట్టించుకోలేదని.. అయితే సుకేశ్ హోమ్ మినిస్ట్రీకి చెందిన ఒక ముఖ్యమైన అధికారి అని తన మేకప్ ఆర్టిస్ట్‌‌ని పింకీ కన్విన్స్ చేసిందని పేర్కొంది. సుకేశ్ తనని తాను సన్ టీవీ ఓనర్‌గా పరిచయం చేసుకున్నాడని, జయలలిత తన ఆంటీ అని చెప్పాడని తెలిపింది. తనకు పెద్ద ఫ్యాన్ అని సుకేశ్ పేర్కొన్నాడని, సన్ టీవీ ఓనర్‌గా తనతో దక్షిణాదిలో సినిమాలు చేస్తానని మాటిచ్చాడని, తాము ఎన్నో ప్రాజెక్టులు చేస్తున్నామని నమ్మబలికాడంది. జైలులో ఉండి కూడా సుకేశ్ తనతో రోజూ మూడుసార్లు ఆడియో లేదా వీడియో కాల్స్ మాట్లాడేవాడని జాక్వెలిన్ రివీల్ చేసింది. రాత్రి పడుకునే ముందు కచ్ఛితంగా ఫోన్ చేసేవాడంది. కానీ.. ఏనాడూ తాను జైల్లో ఉన్న విషయాన్ని అతడు చెప్పలేదని చెప్పింది. అతడు సోఫాలో కూర్చొని మాట్లాడ్డం వల్ల.. తానూ గుర్తించలేకపోయానంది. చివరిసారిగా సుకేశ్ తనతో ఆగస్టు 8వ తేదీన ఫోన్‌లో మాట్లాడాడని, ఆ తర్వాతి నుంచి మళ్లీ కాంటాక్ట్ చేయలేదని జాక్వెలిన్ వెల్లడించింది. ఆ తర్వాత అతడు అరెస్ట్ అయిన విషయం తనకు తెలిసిందని చెప్పుకొచ్చింది.

Hashim Amla: క్రికెట్‌కు వీడ్కోలు పలికిన సౌతాఫ్రికా స్టార్ క్రికెటర్

సుకేశ్ బ్యాక్‌గ్రౌండ్ మొత్తం పింకీకి తెలుసని, అయినా ఏనాడూ తనకు చెప్పలేదని జాక్వెలిన్ వాపోయింది. తనని మోసం చేయాలనే ఉద్దేశంతో సుకేశ్‌తో పింకీ పరిచయం చేసిందని బాంబ్ పేల్చింది. సుకేశ్ తనని ఫూల్ చేశాడని, అతడి క్రిమినల్ బ్యాక్‌గ్రౌండ్ తెలిసిన తర్వాత అతని అసలు పేరు సుకేశ్ అని తనకు తెలిసిందని చెప్పింది. తాను కేరళకి వెళ్లాలని అనుకున్నప్పుడు.. సుకేశ్ తన ప్రైవేట్ జెట్ వాడుకోమని చెప్పాడని, హెలికాప్టర్ రైడ్ కూడా ఆర్గనైజ్ చేశాడని తెలిపింది. చెన్నైలో రెండు సందర్భాల్లో అతడ్ని కలిసినప్పుడు.. అతని ప్రైవేట్ జెట్‌లో తాను రెండుసార్లు ప్రయాణించానని జాక్వెలిన్ చెప్పుకొచ్చింది. కాగా.. రూ.200 కోట్ల మనీలాండరింగ్‌ కేసులో ఇటీవలే ఆమెకు మధ్యంతర బెయిల్‌ మంజూరైన సంగతి తెలిసిందే. 

Oldest Woman in the World: ప్రపంచంలోనే అత్యంత వృద్ధురాలి మృతి

Show comments