Site icon NTV Telugu

Sudha Murty: దయచేసి డీప్‌ఫేక్‌ను నమ్మొద్దు.. వైరల్ వీడియోపై సుధామూర్తి వినతి

Sudha Murty

Sudha Murty

తాను సూచించిన సంస్థల్లో పెట్టుబడులు పెట్టాలంటూ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియో నకిలీది అని రాజ్యసభ ఎంపీ సుధామూర్తి అన్నారు. ఢిల్లీలో ఆమె మీడియాతో మాట్లాడారు. పెట్టుబడుల కోసం డీప్‌ఫేక్ వీడియోను దుర్వినియోగం చేస్తున్నారని.. అదంతా నకిలీ వీడియో అని కొట్టిపారేశారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా నకిలీ వీడియో సృష్టించారని వాపోయారు. దయచేసి ఆ వీడియోను నమ్మొద్దని కోరారు.

ఇది కూడా చదవండి: Modi-Priyanka Gandhi: మోడీ-ప్రియాంకాగాంధీ భేటీ.. దేనికోసమంటే..!

పెట్టుబడిదారులకు చెప్పేది ఒకటే.. తానెప్పుడూ ఎక్కడా పెట్టబడుల గురించి మాట్లాడలేదని.. ఆ విషయంలో తన ముఖాన్ని ఎప్పుడూ చూడరన్నారు. అలాంటి విషయాల్లో ఎప్పుడూ జోక్యం చేసుకోలేదన్నారు. పెట్టుబడుల కోసం తన ముఖాన్ని ఉపయోగించొద్దని.. మనస్ఫూర్తిగా కోరుతున్నారన్నారు.

ఇది కూడా చదవండి: Trump: ట్రంప్ మరో షాకింగ్ నిర్ణయం.. గ్రీన్‌కార్డ్‌ లాటరీ నిలిపేసినట్లు ప్రకటన

ఎవరైనా పెట్టుబడులు పెట్టే ముందు ఆయా సంస్థలకు వెళ్లి చెక్ చేసుకోవాలన్నారు. అంతే తప్ప డబ్బు పోగొట్టుకోవద్దని విజ్ఞప్తి చేశారు. బ్యాంకులను సంప్రదించిన తర్వాత పెట్టుబడులు పెట్టుకోవడం మీ ఇష్టం అని చెప్పారు. పెట్టుబడుల కోసం కొందరు వ్యక్తులు తన ముఖాన్ని ఉపయోగించి డీప్‌ఫేక్ వీడియో సృష్టించడం కరెక్ట్ కాదన్నారు. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియో నకిలీ వార్తగా కొట్టిపారేశారు. వీడియోల వెనక ఉన్న వ్యక్తులను గుర్తించి చర్యలు తీసుకోవాలని సైబర్‌ క్రైమ్‌ పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. దయచేసి ప్రజలెవరూ తప్పుడు వీడియోల మాయలో పడొద్దని కోరారు.

 

Exit mobile version