NTV Telugu Site icon

Suchana Seth: కుమారుడి మృతదేహాన్ని బ్యాగ్‌లో పెట్టుకుని 12 గంటల ప్రయాణం.. సుచనా సేథ్ కేసులో కీలక విషయాలు..

Suchana Seth

Suchana Seth

Suchana Seth: ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ స్టార్టప్ సీఈఓ సుచనా సేథ్ కేసుల యావత్‌ దేశాన్ని దిగ్భ్రాంతికి గురిచేస్తోంది. కొడుకని చూడకుండా.. నాలుగేళ్ల పిల్లాడిని అత్యంత క్రూరంగా హతమార్చింది. కొడుకు మృతదేహాన్ని బ్యాగులో పెట్టుకుని గోవా నుంచి కర్ణాటకకు వెళ్తుండగా.. గోవా పోలీసులు ఆమెను చిత్రదుర్గలో అరెస్ట్ చేశారు. నిందితురాలు జనవరి 6న గోవాలోని కాండోలిమ్ లోని సర్వీస్ అపార్ట్మెంట్‌లో తన కొడుకు గొంతు నులిమి చంపింది. ఈ ఘటన తర్వాత ఆమె కూడా చనిపోయేందుకు ప్రయత్నించిందని కేసు విచారణ అధికారులు తెలిపారు.

అయితే, కుమారుడి శవాన్ని బ్యాగులో పెట్టుకుని దాదాపుగా 12 గంటల పాటు క్యాబ్‌లో ప్రయాణించినట్లు డ్రైవర్ తన భయంకర అనుభవాలను వెల్లడించారు. డ్రైవర్ రేజాన్ డిసౌజా మాట్లాడుతూ.. సుచనా సేథ్ ప్రవర్థన మొదటి నుంచి అనుమానాస్పదంగానే ఉందని వెల్లడించారు. ఆమె బ్యాగ్ చాలా బరువు ఉందని, బ్యాగులో ఏముందని ప్రశ్నించినట్లు అతను వెల్లడించాడు. మద్యం బాటిళ్లు ఉన్నట్లు సుచనా సేథ్ సమాధానం ఇచ్చినట్లు తెలిపారు.

జనవరి 7న ఉత్తర గోవాలోని కాండోలిమ్‌లోని ‘సోల్ బన్యన్ గ్రాండే’ అనే సర్వీస్ అపార్ట్‌మెంట్ నుంచి తనకు కాల్ వచ్చిందని డిసౌజా తెలిపారు. అత్యవసరంగా ఓ మహిళను బెంగళూర్ తీసుకెళ్లాని ఫోన్ వచ్చినట్లు తెలిపారు. తాను ఇద్దరు డ్రైవర్లతో అర్థరాత్రి 12.30 గంటలకు అపార్ట్మెంట్‌కి వచ్చినట్లు, 1 గంటకు సుచనా సేథ్ కారెక్కి, తన బ్యాగ్ తీసుకురావాల్సిందిగా డిసౌజాని కోరింది.

Read Also: Chicken Price: చికెన్ ప్రియులకు అదిరిపోయే న్యూస్.. ఒక్కసారి పడిపోయిన ధరలు..

ప్రయాణమంతా సుచనా నిశ్శబ్ధంగానే ఉన్నారని, వాటర్ బాటిల్ కోసం ఒక్క చోట మాత్రమే ఆగారని డ్రైవర్ వెల్లడించారు. గోవా-కర్ణాటక సరిహద్దుల్లో రోడ్డు బ్లాక్ ఉన్నప్పటికీ ఆమె ఎలాంటి ఆందోళన, భయాన్ని చూపించలేదని, అయితే త్వరగా వెళ్లాలని చెప్పింది, నాలుగు గంటలు ఆలస్యం అయినప్పటికీ ఎలాంటి అసహనం చూపించకపోవడం తనకు ఆశ్చర్యాన్ని కలిగించాయని డిసౌజా చెప్పారు. తాను యూటర్న్ తీసుకుని ఎయిర్‌పోర్టులో దింపుతానని చెప్పినా నిరాకరించినట్లు వెల్లడించారు.

తాము కర్ణాటక సరిహద్దులు దాటగానే తమకు గోవా పోలీసుల నుంచి కాల్ వచ్చిందని, ఆ మహిళతో పిల్లాడు ఉన్నాడా..? అని పశ్నించారని, తాను ఏం సమస్య అని అడగగా.. ఆమె బస చేసిన రూంలో రక్తపు మరకలు కనిపించాయని పోలీసులు చెప్పినట్లు డ్రైవర్ డిసౌజా వెల్లడించారు. ఆ తర్వాత ఆమె చెప్పిన వివరాలు, చిరునామా నకిలీవని పోలీసుల నుంచి మరోసారి కాల్ వచ్చిందని, అప్పుడు ఏదో తప్పు జరిగినట్లు నిర్థారించుకున్నట్లు తెలిపాడు.

పోలీసులు సమీపంలోని పోలీస్ స్టేషన్‌కి కార్ తీసుకెళ్లాలని కోరారని, గూగుల్ మ్యాప్స్‌లో సమీపంలో ఎక్కడా పోలీస్ స్టేషన్ లేదని, తాము పోలీస్ స్టేషన్ దాటి వచ్చినట్లు గుర్తించానని, ఒక వేళ యూటర్న్ తీసుకుని వెనక్కి వెళ్తే నిందితురాలు అప్రమత్తమయ్యే అవకాశం ఉందని ఈ విధంగా చేయలేదని డ్రైవర్ చెప్పాడు. సమీపంలోని ఓ రెస్టారెంట్ వద్ద పోలీస్ స్టేషన్ ఎక్కడ ఉందని ఆరా తీసి, కారుని పోలీస్ స్టేషన్ తీసుకెళ్లినట్లు వెల్లడించారు. తనను ఇక్కడికి ఎందుకు తీసుకువచ్చారని ప్రశ్నించిందని, ఆ తర్వాత బ్యాగ్ చెక్ చేయగా.. పిల్లాడి డెడ్ బాడీ బయటపడినట్లు వెల్లడించాడు.

Show comments