Site icon NTV Telugu

Chenab Railway Bridge: ప్రపంచంలోనే ఎత్తైన వంతెనపై నుంచి రైలు ప్రయాణం.. ట్రయర్ రన్ వీడియో వైరల్..

Chenab Railway Bridge

Chenab Railway Bridge

Chenab Railway Bridge: ప్రపంచంలోనే అత్యంత ఎతైన రైల్వే బ్రిడ్జ్‌ని నిర్మించి భారత్ రికార్డ్ సృష్టించింది. జమ్మూ కాశ్మీర్‌లో రైల్వే మార్గానికి ఎంతో కీలకమైన ‘‘చీనాబ్ రైల్వే వంతెన’’ పై నుంచి ఈ రోజు భారతీయ రైల్వే విజయవంతంగా ట్రయల్ రన్ నిర్వహించింది. రాంబన్ జిల్లాలోని సంగల్దాన్-రియాసీ మధ్య చీనాబ్ నదిపై ఈ వంతెనను నిర్మించారు. ఈ మార్గంలో త్వరలోనే రైలు సేవలు ప్రారంభం కానున్నాయని అధికారలు తెలిపారు. ట్రయల్ రన్‌లో రైలు జమ్మూ కాశ్మీర్‌లోని అందమై పర్వతాల మధ్య ఉన్న చీనాబ్ వంతెన పై నుంచి ప్రయాణించడం చూడొచ్చు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం వైరల్‌గా మారింది.

Read Also: Summer solstice: రేపు ఏడాదిలోనే ‘‘సుదీర్ఘమైన పగలు’’.. అయనాంతాలు అంటే ఏమిటి, ఎలా ఏర్పడుతాయి..?

ఈ వంతెన చీనాబ్ నదికి ఎగువన 359 మీటర్లు( సుమారు 109 అడుగులు) ఎత్తులో నిర్మితమైంది. పారిస్‌లోని ఈఫిల్ టవర్ కన్నా దాదాపుగా 35 మీటర్ల ఎత్తు ఉంటుంది. ఉదంపూర్ శ్రీనగర్ బాలాముల్లా రైల్ లింక్(USBRL) ప్రాజెక్ట్ కింద ఈ వంతెనను నిర్మించారు. ఇది జమ్మూని, కాశ్మీర్‌ని రైలుతో అనుసంధానిస్తుంది. కాశ్మీర్‌ని మిగతా దేశంతో కలుపుతుంది. 48.1 కి.మీ పొడమైన బనిహాల్-సంగల్దాన్ సెక్షన్ ప్రాజెక్టును ఫిబ్రవరి 20,2024న ప్రధాని మోడీ ప్రారంభించారు.

తాజాగా జరిగిన రైలు ట్రయల్ రన్‌కి సంబంధించిన వివరాలను కేంద్ర రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ ఎక్స్ వేదికగా షేర్ చేశారు. సంగల్దాన్-రియాసి సెక్షన్ల మధ్య MEMU రైలు ట్రయల్ రన్ విజయవంతమైందని ప్రకటించారు. 118 కి.మీ ఖాజిగుండ్-బారాముల్లా మధ్య కవర్ చేసే ప్రాజెక్టుని ఫేస్-1 పనుల్ని అక్టోబర్ 2009లో ప్రారంభించారు. తదుపరి దశల్లో 18 కి.మీ బనిహాల్-ఖాజీగుండ్ సెక్షన్ ని జూన్ 2013లో, 35కి.మీ ఉధంపూర్-కత్రా సెక్షన్‌ని జూలై 2014లో ప్రారంభించారు.

Exit mobile version