డబ్బులు సంపాదించాలంటే చదువు ఉంటే సరిపోదు.. కాస్త బుద్ది బలం ఉంటే సరిపోతుంది.. ఏదైనా సాధించాలి అనే కసి ఉంటే చాలు అసాధ్యాన్ని, సుసాధ్యం చేస్తున్నారు.. తాజాగా ఓ రైతు పది పాసయ్యాడు.. ఆ తర్వాత వ్యవసాయం లో కొత్త పుంతలు తొక్కారు.. సేంద్రియ వ్యవసాయంతో పంటను పండిస్తూ అదిరిపోయే లాభాలను పొందుతూన్నాడు..ఆ ఆదర్శ రైతు సక్సెస్ స్టోరీ గురించి ఈరోజు మనం తెలుసుకుందాం..
రాజస్థాన్‌లోని భిల్వారాకు చెందిన అబ్దుల్ రజాక్ అనే రైతు.. రసాయనిక ఎరువుల తో పండించిన పంటలు తిన్న వృద్ధుడైన తండ్రి క్యాన్సర్ బారిన పడి మరణించాడు. తండ్రి మరణం తో కుమారుడు అబ్దుల్ రజాక్ లో ఆలోచన రేకెత్తించింది. అంతేకాదు.. తండ్రిలా ఎరువులతో పండే పంటలు తిని వ్యాధుల బారిన పడకుండా ఉండాలని భావించి సేంద్రియ వ్యవసాయం చేయాలనీ ఆలోచించాడు.. సేంద్రియ వ్యవసాయం తో భారీగా లాభాలను పొందుతూన్నాడు.. అతను తన 10 ఎకరాల భూమిలో సేంద్రియ వ్యవసాయం ద్వారా దోసకాయ, టమాటా, క్యాప్సికం, ఆనప కాయ వంటి కూరగాయలతో పాటు జామ, నారింజ వంటి పండ్లను పండిస్తున్నాడు. ప్రస్తుతం తాను పండిస్తున్న పంటల ద్వారా ఏటా రూ.కోటి సంపాదిస్తున్నాడు. ఇందులో దాదాపు రూ.30 లక్షల వరకు పంట పెట్టుబడిగా ఖర్చు అవుతుంది.. దానికి నికర లాభంగా రూ 70 లక్షల ఆదాయాన్ని పొందుతూన్నాడు..
అతను పంటలకు జీవామృతం, ఆవు మూత్రం, దేశి ఎరువు ,పచ్చి ఎరువుతో పాటు బాక్టీరియల్ కల్చర్, బయో-పెస్టిసైడ్, క్రిసోపా వంటి బయో ఏజెంట్ల ను ఉపయోగిస్తాడు. దీంతో పంట దిగుబడి పెరుగుతుంది. రాష్ట్రం నలుమూలల నుండి రైతులు అబ్దుల్ రజాక్ వద్దకు వ్యవసాయం గురించి తెలుసుకోవడానికి వస్తారు. సేంద్రియ వ్యవసాయం గురించి ప్రజలకు అవగాహన కల్పించేందుకు అబ్దుల్ స్వయంగా సోషల్ మీడియా ద్వారా ఉచిత సమాచారం కూడా ఇస్తున్నాడు.. నిత్యం వ్యవసాయం లో కొత్త మార్గాలను వెతుకుతూ అదిరిపోయే లాభాలను పొందుతూన్నాడు.. ఇప్పుడు అందరికి ఆదర్శంగా నిలుస్తున్నారు..
