కర్ణాటకలో నాయక్వంలో మార్పు ఉండొచ్చని గత కొన్ని రోజులుగా వార్తలు వస్తున్నాయి. ఈ వార్తల్లో ఎంత వరకు నిజం ఉందనే విషయం ఇప్పటి వరకు స్పష్టంకాలేదు. అయితే, ముఖ్యమంత్రిని మారిస్తే ఇబ్బందులు వస్తాయని, రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి రావడం కష్టం అవుతుందని కొందరివాదన. అటు అధిష్టానం కూడా యడ్డియూరప్పను మార్చేందుకు సాహసం చేయడంలేదు. కర్ణాటక తాజా రాజకీయాలపై బీజేసీ సీనియర్ నేత సుబ్రహ్మణ్యస్వామి స్పందించారు. కర్ణాటకలో ముఖ్యమంత్రిని మార్చడం పెద్ద సాహసమే అవుతుందని, రాష్ట్రంలో తొలిసారి బీజేపి అధికారంలోకి రావడానికి ప్రధాన కారణం యడ్డియూరప్ప అని, ఆయన సత్తా కలిగిన నేత అని అన్నారు. యడ్డియూరప్ప లేనందువలనే 2013లో అధికారం దక్కలేదని, ఇప్పుడు మరోసారి ఆ తప్పు చేస్తారని అనుకోవడం లేదని సుబ్రహ్మణ్యస్వామి పేర్కొన్నారు.
Read: యూరప్ లోకి నో ఎంట్రీ! విక్కీ కౌశల్ భారీ సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్ మరింత ఆలస్యం…
