Rahul Gandhi: లోక్‌సభలో ప్రతిపక్ష నేత, కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీపై ఢిల్లీ హైకోర్టులో బీజేపీ నేత సుబ్రమణ్య స్వామి శుక్రవారం ఓ పిటిషన్ దాఖలు చేసినట్లు తెలుస్తోంది. రాహుల్ గాంధీ భారత పౌరసత్వాన్ని రద్దు చేసేలా హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖని ఆదేశించాలని ఆయన హైకోర్టుని ఆశ్రయించారు. వివరాల ప్రకరాం.. 2003లో యునైటెడ్ కింగ్‌డమ్‌లో బ్యాకాప్స్ లిమిటెడ్ అనే సంస్థ రిజస్టర్ చేయబడిందని, రాహుల్ గాంధీ దాని డైరెక్టర్లు, దాని సెక్రటరిల్లో ఒకరని, 2019లోనే హోం మంత్రిత్వ శాఖకు సుబ్రమణ్య స్వామి లేఖ రాశారు.
అక్టోబర్ 10, 2005 మరియు అక్టోబర్ 31, 2006 న దాఖలు చేసిన సంస్థ వార్షిక రిటర్న్స్‌లో రాహుల్ గాంధీ తన జాతీయతను బ్రిటిష్‌గా ప్రకటించుకున్నారని స్వామి ఆరోపించారు. ఫిబ్రవరి 17, 2009న బ్యాకప్స్ లిమిటెడ్ రద్దు అప్లికేషన్‌లో కూడా మళ్లీ ఆయన తన జాతీయతను బ్రిటిష్‌గా ప్రకటించుకున్నట్లు ఆయన పేర్కొన్నారని కోర్టులో దాఖలు చేసిన పిటిషన్లో పేర్కొన్నారని తెలుస్తోంది.
Read Also: Uddhav Thackeray: ‘‘ఆ ఆస్తుల్ని తాకనివ్వం’’.. వక్ఫ్ బిల్లుపై మౌనం వీడిన ఠాక్రే..
రాహుల్ గాంధీ రాజ్యాంగాన్ని ఉల్లంఘించారని స్వామి ఆరోపించారు. ఇది భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 9, భారత పౌరసత్వ చట్టం-1955ని ఉల్లంఘించడమే అని ఆయన ఆరోపించారు. నివేదిక ప్రకారం.. ఏప్రిల్ 29, 2019న హోం మంత్రిత్వ శాఖ రాహుల్ గాంధీకి లేఖ రాసింది. ఈ విషయంలో వాస్తవ వైఖరిని తెలపాలని కోరింది. ఆయనకు లేఖ రాసి 5 ఏళ్లు గడిచినా, రాహుల్ గాంధీ ఏం నిర్ణయం తీసుకున్నారనే దానిపై హోంశాఖకు స్పష్టత ఇవ్వలేదని బీజేపీ ఆరోపిస్తోంది.
రాహుల్ గాంధీ 5 సార్లు ఎంపీగా ఉన్నారు. 2004, 2019 వరకు ఆయన మూడు పర్యాయాలుగా అమేథీకి ప్రాతినిధ్యం వహించారు. 2019లో బీజేపీ నేత స్మృతి ఇరానీ చేతిలో ఓడిపోయారు. అదే సమయంలో రెండో స్థానం వయనాడ్ నుంచి పోటీ చేసి గెలుపొందారు. 2024 ఎన్నికల్లో రాయబరేలీని నుంచి పోటీ చేసి గెలుపొందారు. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ 99 స్థానాలను గెలుచుకుని, ప్రతిపక్ష ఇండియా కూటమిలో పెద్ద పార్టీగా అవతరించింది. 10 ఏళ్ల తర్వాత కాంగ్రెస్‌కి ప్రతిపక్ష నేత పదవి దక్కింది.
