Site icon NTV Telugu

JP Nadda’s Dinner: ఎన్డీయే నేతలకు జేపీ నడ్డా విందు.. మెనూ ఇదే..

Jp Nadda's Dinner

Jp Nadda's Dinner

JP Nadda’s Dinner: వరసగా ప్రధానిగా మూడోసారి నరేంద్రమోడీ నేడు ప్రమాణస్వీకారం చేయబోతున్నారు. ఇందుకు రాష్ట్రపతి భవన్ వేదిక కాబోతోంది. సాయంత్రం 7.15 నిమిషాలకు ప్రధానిగా మోడీ బాధ్యతలు స్వీకరించనున్నారు. ఇప్పటికే ఢిల్లీలో కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేశారు. మరోవైపు మోడీ 3.0 కేబినెట్‌లో చోటు దక్కించుకున్న ఎంపీలు ఇప్పటికే ఢిల్లీ చేరుకున్నారు. మరోవైపు భారత ఇరుగుపొరుగు దేశాలైన బంగ్లాదేశ్, శ్రీలంక, నేపాల్, భూటాన్, మాల్దీవులు, షీసెల్స్, మారిషన్ దేశాలకు చెందిన దేశాధినేతలు ఈ కార్యక్రమానికి హాజరుకానున్నారు.

Read Also: Modi’s swearing-in: ప్రధాని మోదీ ప్రమాణ స్వీకారోత్సవానికి చంద్రబాబు హాజరుకానున్నారు

ఇదిలా ఉంటే, ప్రమాణస్వీకారం ముగిసిన తర్వాత జేపీ నడ్డా కొత్తగా ఎన్నికైన ఎన్డీయే ఎంపీలకు విందు ఏర్పాటు చేశారు. డిన్నర్ మెనూలో నోరూరించే వంటకాలు ఉన్నాయి. వివిధ రకాల జ్యూస్‌లో పాటు స్టఫ్డ్ లీచీ, మట్కా కుల్ఫీ, మ్యాంగో క్రీమ్‌తో సహా వేడిన రైతాను అందించనున్నారు.డిన్నర్‌లో జోధ్‌పురి సబ్జీ, దాల్, దమ్ బిర్యానీతో సహా ఐదు రకాల బ్రెడ్స్‌ని ఏర్పాటు చేశారు. పంజాబీ ఫుడ్ కౌంటర్ కూడా ఉంది. మిల్లెట్లను ఇష్టపడే వారికి బజ్రా కిచిడీ, రసమలై మెనూలో ఉంది.

Exit mobile version