NTV Telugu Site icon

Bomb Threat: ఎగ్జామ్స్ వాయిదా వేసేందుకు స్కూల్కి స్టూడెంట్స్ బాంబు బెదిరింపులు..

Delhi

Delhi

Bomb Threat: దేశ రాజధాని ఢిల్లీలో వరుస బాంబు బెదిరింపులు తీవ్ర కలకలం రేపుతున్నాయి. ఈ హెచ్చరికలకు సంబంధించి కీలక విషయాలను పోలీసులు వెల్లడించారు. ఇటీవల వచ్చిన రెండు బాంబు బెదిరింపులను స్టూడెంట్స్ చేసినట్లుగా గుర్తించినట్లు తెలిపారు. పరీక్షలను వాయిదా వేయడం కోసమే తాము ఈ పని చేసినట్లు సదరు విద్యార్థులు పోలీసుల విచారణలో వెల్లడించారని చెప్పుకొచ్చారు.

Read Also: Melbourne Test: బాక్సింగ్‌ డే టెస్టును వేడేక్కించనున్న వాతావరణం.. రికార్డు స్థాయి పక్కా!

ఇక, ఇటీవల రోహిణిలోని రెండు స్కూల్స్ కు బాంబు బెదిరింపు ఈ- మెయిల్స్ వచ్చాయి. అదే పాఠశాలకు చెందిన ఇద్దరు విద్యార్థులు వేర్వేరుగా ఈమెయిల్‌లు పంపించారి తేల్చారు. అయితే, విద్యార్థులిద్దరూ పరీక్షకు రెడీగా లేకపోవడం వల్ల దాన్ని వాయిదా వేయించేందుకే ఈ పని చేశామని చెప్పారని పోలీసులు పేర్కొన్నారు. మరో స్కూల్‌కు వచ్చిన బెదిరింపు సైతం ఇలాంటిదేనన్నారు. పాఠశాలలకు వెళ్లడం ఇష్టం లేక ఓ స్టూడెంట్ ఇలా చేసినట్లు సమాచారం. అధికారులు విద్యార్థులతో పాటు వారి తల్లిదండ్రులకు కౌన్సిలింగ్ ఇచ్చారు.

Read Also: Congo: కాంగోలో పడవ బోల్తా.. 38 మంది మృతి, 100కి పైగా గల్లంతు!

అయితే, ఈ ఏడాది ఆరంభం నుంచి ఢిల్లీతో సహా ఇతర ప్రాంతాల్లోని స్కూల్స్ కు పలుమార్లు బాంబు బెదిరింపులు వచ్చాయి. డిసెంబర్ 9న 40కి పైగా స్కూళ్లకు ఇదే తరహాలో బెదిరింపులు రాగా, స్కూల్స్ ఆవరణల్లో పేలుడు పదార్థాలను పెట్టాం.. వాటిని పేల్చకుండా ఉండేందుకు రూ. 30 వేల డాలర్లు ఇవ్వాలని దుండగులు హెచ్చరించారు. అయితే, అది ఫేక్ ఈ-మెయిల్ అని పోలీసుల ప్రైమరీ విచారణలో తేలింది.