Varanasi: వారణాసిలోని ఉదయ్ ప్రతాప్ కాలేజీ క్యాంపస్‌లో మసీదు వివాదానికి ఆజ్యం పోసింది. మసీదును తొలగించాలని పెద్ద ఎత్తున విద్యార్థులు నిరసనకు దిగడంతో ఉద్రిక్తత నెలకొంది. ఉత్తర్ ప్రదేశ్ వక్ఫ్ బోర్డు యాజమాన్యం ఈ స్థలాన్ని క్లెయిమ్ చేసినట్లు నివేదికలు రావడంతో నిరసన ప్రదర్శన జరిగింది. శుక్రవారం కాలేజీ గేటు వద్ద వందలాది మంది విద్యార్థులు జైశ్రీరాం అంటూ నినాదాలు చేశారు. క్యాంపస్ లోకి ప్రవేశించేందుకు ప్రయత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. విద్యార్థి నాయకుడు వివేకానంద్ సింగ్ మాట్లాడుతూ.. మసీదు ఉన్న స్థలం వక్ఫ్ బోర్డుకు చెందకపోతే నిర్మాణాన్ని అక్కడ నుంచి తొలగించాలని అన్నారు. మసీదులో నమాజ్ కొనసాగిస్తే, విద్యార్థులు అక్కడ హనుమాన్ చాలీసా పఠిచడం ద్వారా ప్రతిస్పందిస్తారని హెచ్చరించారు.
Read Also: KTR : గాంధీభవన్ వెలవెలబోతుండగా.. తెలంగాణ భవన్ రోజూ సందడిగా ఉండటం విశేషం
తీవ్ర ఉద్రిక్తతల మధ్య పోలీసులు గురువారం క్యాంపస్‌లోకి బయట వ్యక్తుల ప్రవేశాన్ని పరిమితం చేశారు. ఐడీ కార్డు ఉన్న వారిని మాత్రమే లోపలికి అనుమతించారు. మసీదు దగ్గర నమాజ్ చేస్తున్న సమయంలో హనుమాన్ చాలీసా పఠించిన తర్వాత మంగళవారం ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. ఈ వివాదంలో ఏడుగురిని అదుపులోకి తీసుకున్నారు. ఈ పరిణామాల నేపథ్యంలో స్టూడెంట్స్ ‘‘కాలేజ్ కోర్టు’’ ఏర్పాటు చేసి, వక్ఫ్ బోర్డుకు 11 పాయింట్లతో లేఖ పంపారు. మసీదు స్థితి, దాని యాజమాన్యం గురించి 15 రోజుల్లో సమాధానం ఇవ్వాలని డిమాండ్ చేశారు.
115 ఏళ్ల చరిత్ర కలిగిన కళాశాలపై వక్ఫ్ బోర్డు క్లెయిమ్ చేయడంతో పరిస్థితి వివాదాస్పదంగా మారింది. అయితే, వక్ఫ్ బోర్డు దావాని కాలేజీ అడ్మినిస్ట్రేషన్ తీవ్రంగా ఖండించింది. ఇది ఛారిటబుల్ ఎండోమెంట్‌కి చెందిన భూమి అని, వక్ఫ్ బోర్డుది కాదని పేర్కొంది. అయితే, మసీదు స్థితిని తనిఖీ చేయాలని అంజుమన్ ఇంతేజామియా మసీదు కమిటీ వక్ఫ్ బోర్డుకు లేఖ రాసింది. 2018 నాటి ఉత్తర్వుల ప్రకారం.. మసీదు వక్ఫ్ ఆస్తిగా క్లెయిమ్ చేయడాన్ని 2021లో రద్దు చేసినట్లు మసీదు కమిటీ సెక్రటరీ మహ్మద్ యాసీన్ అన్నారు. ప్రస్తుత వివాదానికి కారణం లేదని చెప్పారు.