NTV Telugu Site icon

Border Dispute: కర్ణాటక-మహారాష్ట్ర సరిహద్దు వివాదం.. జెండా పట్టుకున్నందుకు తోటి విద్యార్థిపై దాడి

Karnataka

Karnataka

Students beat up boy for raising Karnataka flag amid border dispute: కర్ణాటక-మహారాష్ట్రల మధ్య సరిహద్దు వివాదం ముదురుతోంది. ఇప్పటికే రెండు రాష్ట్రాలకు చెందిన నేతల పరస్పరం విమర్శలు చేసుకున్నారు. కర్ణాటక సీఎం బస్వరాజ్ బొమ్మై, మహారాష్ట్ర డిఫ్యూటీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ మధ్య విమర్శలు చెలరేగాయి. ఇదిలా సరిహద్దు వివాదం విద్యార్థులు కూడా రెచ్చిపోయేలా చేసింది బెలగావిలోని ఇంటర్ కాలేజ్ ఫెస్ట్ లో కర్ణాటక జెండా ఎగరేసినందుకు తోటి విద్యార్థులు మరో విద్యార్థిని కొట్టారు. సరిహద్దు వివాదం నడుస్తున్న వేళ ఈ ఘటన జరిగింది.

Read Also: Father Kills Son: దారుణం.. ఆస్తి కోసం కొడుకు చంపిన కన్న తండ్రి

బెలగావి జిల్లాలోని ఇంటర్ కాలేజ్ ఫెస్టివ్ సందర్భంగా సెకండ్ ఇయర్ చదువుతున్న ఓ విద్యార్థి కర్ణాటక జెండాను ప్రదర్శించాడు. డ్యాన్స్ కార్యక్రమాన్ని రికార్డ్ చేస్తున్న సమయంలో ఈ ఘటన కెమెరాల కంటికి చిక్కింది. పది సెకన్ల పాటు సదరు విద్యార్థి కర్ణాటక జెండాను ఎగరేశాడు. దీంతో ఆగ్రహించిన మరికొంత మంది విద్యార్థులు దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనపై పోలీసులు విచారణ ప్రారంభించారు. అయితే గొడవకు దిగిన వారంతా మైనర్లే. తదుపరి విచారణ జరుగుతుందని పోలీసులు వెల్లడించారు. ఇదిలా ఉంటే గురువారం మహారాష్ట్ర-కర్ణాటక సరిహద్దు వివాదంపై గురువారం సుప్రీంకోర్టులో విచారణ జరగనుంది. కర్ణాటక ముఖ్యమంత్రి బస్వరాజ్ బొమ్మై మాట్లాడుతూ కర్ణాటక వైఖరి రాజ్యాంగబద్ధమైంది, చట్టబద్ధమైందని పేర్కొన్నారు.

మహారాష్ట్ర సాంగ్లీ జిల్లాలో జాత్ తహసీలుకు చెందిన కొన్ని గ్రామాలు కర్ణాటకలో విలీనం అయ్యేందుకు తీర్మానం చేశాయని కర్ణాటక ముఖ్యమంత్రి బొమ్మై అనడంతో వివాదం మొదలైంది. దీనికి ప్రతిగా మహారాష్ట్రలోని ఏ గ్రామం కూడా కర్ణాటకలోకి వెళ్లదని.. బెల్గాం-కార్వార్-నిపానీ సహా మరాఠీ మాట్లాడే గ్రామాలను పొందేందుకు రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో గట్టిగా పోరాడుతుందని ఆయన అన్నారు. ఏ గ్రామం కూడా కర్ణాటకలో చేరేందుకు తీర్మానం చేయలేదని ఫడ్నవీస్ అన్నారు. 1956లో రెండు రాష్ట్రాలు ఏర్పడినప్పటి నుంచి ఈ సమస్య అలాగే ఉంది. కర్ణాటకలోని బెళగావిని మహారాష్ట్ర తమదే అని చెబుతుంటే.. మహారాష్ట్రలోని షోలాపూర్ తమదే అని కర్ణాటక చెబుతోంది.