Site icon NTV Telugu

Heart Attack: విషాదం.. క్లాసు వింటూనే కుప్పకూలిన సివిల్ సర్వీసెస్ అభ్యర్థి..

Indore

Indore

Heart Attack: ఇటీవల కాలంలో యువకులతో పాటు టీనేజ్‌లో ఉన్న యువకులు కూడా గుండెపోటు బారిన పడుతుండటం ఆందోళన కలిగిస్తోంది. పెళ్లి వేడుకల్లో డ్యాన్స్ చేస్తూ, జిమ్‌లో వ్యాయామం చేస్తూ యువకులు మరణించిన సంఘటనలు చూశాం. ఇలాంటి విషాదకరమైన ఘటనే మధ్యప్రదేశ్ ఇండోర్‌లో చోటు చేసుకుంది. సివిల్ సర్వీస్ కోచింగ్ సెంటర్‌లో క్లాస్ వింటూనే గుండెపోటుతో కూలిపోయాడు ఓ విద్యార్థి.

Read Also: Chiranjeevi : మెగాస్టార్ కు పద్మవిభూషణ్ ఇవ్వనున్న కేంద్రం..?

మధ్యప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (MPPSC) పరీక్షలకు సిద్ధమవుతున్న విద్యార్థి ఇండోర్‌లోని తన కోచింగ్ క్లాస్‌లో కుప్పకూలి మరణించాడు. సాగర్ జిల్లాకు చెందిన రాజా లోధిగా బాధితుడిని గుర్తించారు. క్లాస్‌ వింటూనే అకస్మాత్తుగా ఛాతి నొప్పితో బాధపడటం, పక్కనే ఉన్న విద్యార్థులు గమనించి సాయం అందిచేందుకు ప్రయత్నించడం అంతా అక్కడ సీసీ కెమెరాల్లో రికార్డైంది. కొన్ని సెకన్లలోనే అపాస్మారక స్థితిలోకి వెళ్లాడు.

అతని స్నేహితులు నొప్పి తీవ్రతరం కాకముందే లోధిని సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. అయితే అప్పటికే అతను మరణించినట్లు వైద్యులు ప్రకటించారు. ఇటీవల ఇలాగే ఇండోర్ నగరంలో ముగ్గురు యువకులు గుండెపోటుతో మరనించారు. మృతికి గల ఖచ్చితమైన కారణాలపై విచారణ జరుపుతున్నారు.

Exit mobile version