Site icon NTV Telugu

Emergency: ట్రైన్ లో మహిళకు పురిటి నొప్పులు.. యువకుడు ఏం చేశాడంటే…

Untitled Design (2)

Untitled Design (2)

ట్రైన్ లో ప్రయాణిస్తున్న ఓ మహిళకు పురిటి నొప్పులు వచ్చాయి. రైలు మాత్రం వంద కిలో మీటర్ల వేగంతో దూసుకుపోతుంది. ఏం చేయాలో తెలియకు ఆందోళన చెందారు కుటుంబ సభ్యులు. అప్పుడే ఓ విద్యార్థి వైద్యుడిగా మారాడు.

Read Also:Temple employees: పండగ పూట ఇలాంటి గిప్ట్ ఇచ్చారేంట్రా బాబు..

పూర్తి వివరాల్లోకి వెళితే.. అర్థరాత్రి ఒంటి గంట టైంలో ఓ మహిళకు ఉన్నట్టుండి పురుటి నొప్పులు వచ్చాయి. కుటుంబ సభ్యుల్లో ఆందోళన మొదలైంది. అప్పుడే ఒక విచిత్రం జరిగింది. ఓ ఇంజనీరింగ్ విద్యార్థి.. వైద్యుడిగా మారాడు. రైల్వే స్టేషన్‌ ఆస్పత్రి బెడ్‌గా మారింది. ఈ ఘటన ముంబైలో జరిగింది. ఓ మహిళ తన కుటుంబంతో కలిసి ట్రైన్‌లో ప్రయాణిస్తుండగా.. ఉన్నట్టుండి పురిటి నొప్పులు ప్రారంభమయ్యాయి. ముంబైలోని రామ్‌మందిర్ స్టేషన్‌కు రాగానే ఆమె పరిస్థితి గమనించిన వికాస్ అనే యువకుడు..చైన్‌లాగి ట్రైన్ ఆపాడు. అంబులెన్స్‌కు ఫోన్‌ చేసి విషయం చెప్పాడు. అయితే ఆ ప్రాంతానికి అంబులెన్స్‌ చేరుకోవడానికి సమయం పడుతుందని చెప్పారు. మరో వైపు పరిస్థితి విషమంగా మారుతుంది. దీంతో ఆమె కుటుంబ సభ్యులతో పాటు ఇతర ప్రయాణికుల్లో ఆందోళన మొదలైంది.

Read Also:Danger: ఫోన్ 100% ఛార్జింగ్ పెడుతున్నారా.. అయితే బీకేర్ ఫుల్…

అయితే ఇక్కడా యువుకుడికి మొదట ఏం తోచలేదు. ఏదో ఐడియా ఒక ఐడియా వచ్చినట్లు .. తనకు తెలిసిన ఓ మహిళా డాక్టర్ కు వీడియో కాల్ చేశాడు. ఆమె వెంటనే స్పందించింది. గర్భిణి సుఖంగా ఎలా డెలివరీ చేయాలో అతడికి సూచించింది. దీంతో అతడు ఆమె చెప్పిన విధంగా చేయడంతో ఆమెకు సుఖ ప్రసవం జరిగి.. మగబిడ్డకు జన్మనిచ్చింది. ప్రసవం తర్వాత ప్రయాణీకులు, రైల్వే సిబ్బంది సహాయంతో తల్లి, బిడ్డను సురక్షితంగా ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం తల్లీబిడ్డ ఇద్దరూ ఆరోగ్యంగా ఉన్నారు. మరోవైపు ఈ వీడియోలో సోషల్‌మీడియాలో వైరల్‌గా మారాయి. ఆపత్కాలంలో ధైర్యంగా వ్యవహరించి ప్రసవం చేసిన వికాస్‌పై ప్రశంసల జల్లు కురుస్తోంది.

Exit mobile version