NTV Telugu Site icon

Anti-rape Footwear: అత్యాచార నిరోధక ఫుట్‌వేర్‌ని రూపొందించిన కర్ణాటక విద్యార్థిని

Karnataka

Karnataka

Student develops ‘anti-rape footwear’ with GPS: కర్ణాటకకు చెందిన పదో తరగతి విద్యార్థిని వినూత్నంగా ఆలోచించింది. ప్రస్తుతం సమాజంలో మహిళలు, బాలికలపై అత్యాచారాలు జరుగుతున్న నేపథ్యంలో ‘యాంటీ రేప్ ఫుట్‌వేర్’ని తయారు చేసింది. మహిళలపై అఘాయిత్యాలకు పాల్పడేందుకు ప్రయత్నించే కామాంధుల నుంచి తమను తాము రక్షించుకునేందుకు ఈ పాదరక్షలు ఉపయోగపడనున్నాయి. బాలికలు, మహిళల పట్ల అనుచితంగా ప్రవర్తించే నేరస్థుల నుంచి కాపాడుకునేందుకు ‘యాంటీ రేప్ ఫుట్‌వేర్’ ఉపయోగపడనుందని వీటిని రూపొందించిన విద్యార్థిని చెబుతోంది.

కర్ణాటక కలబురగికి చెందిన విజయలక్ష్మీ బిరాదార్(ఎల్) అనే పదో తరగతి విద్యార్థిని వీటిని రూపొందించారు. కలబురిగికి చెందిన ఎస్‌ఆర్‌ఎన్ మెహతా స్కూల్‌లో విజయలక్ష్మీ బిరాదార్ చదువుతోంది. ‘యాంటీ రేప్ ఫుట్‌వేర్’ బాలికలపై అఘాయిత్యాలకు పాల్పడే వారికి విద్యుత్ షాక్ ఇవ్వడంతో పాటు జీపీఎస్ సౌకర్యం ఉంటుంది.

యాంటీ రేప్ ఫుట్‌వేర్ ఎలా పని చేస్తుంది?

నేరస్థుడు ఎవరైనా బాలికపై లైంగిక దాడి చేసే సమయంలో ఈ యాంటీ రేప్ ఫుట్‌వేర్ తో తన్నుతుందని.. దీంతో ఆ వ్యక్తి కరెంట్ షాక్ కు గురువుతాడని విజయలక్ష్మీ వివరించారు. బ్యాటరీల సాయంతో పాదరక్షల గుండా విద్యుత్ ప్రసరిస్తుందని.. నేరస్తులతో పోరాడేందుకు బాలికలకు ఇది సహాయపడుతుందని ఆమె వెల్లడించారు. ఇంతే కాకుండా దీంట్లో జీపీఎస్ ఫీచర్ కూడా కలిగి ఉన్నట్లు వెల్లడించారు. ఇది బాలిక లైవ్ లొకేషన్ ట్రాక్ చేసేందుకు తల్లిదండ్రులకు హెచ్చరికలు పంపుతుందని తెలిపారు.

ఈ ప్రాజెక్టు గురించి విజయలక్ష్మీ టీచర్ మాట్లాడారు.. 2018లో విజయలక్ష్మీ 7,8 తరగతులు చదువుతున్నప్పుడే ఈ ప్రాజెక్టుపై పనిచేయడం ప్రారంభించిందని వెల్లడించారు. విజయలక్ష్మీ అనేక అవార్డులను గెలుచుకున్నారని.. ఈ ప్రాజెక్టులో చాలా కాలం నుంచి పనిచేస్తున్నారని ఆమె వెల్లడించారు. ఇటీవల గోవాలో జరిగిన ఇంటర్నేషనల్ ఇన్వేన్షన్ అండ్ ఇన్నోవేషన్ ఎక్స్‌పో అవార్డు గెలుచుకున్నట్లు వెల్లడించారు.