NTV Telugu Site icon

Narendra Modi: దేశంలో మహిళల భద్రత కోసం అనేక కఠినమైన చట్టాలు ఉన్నాయి..

Pm Mdoi

Pm Mdoi

Narendra Modi: ఢిల్లీలో రెండు రోజుల న్యాయ సదస్సు ప్రారంభమైంది. ఈ న్యాయ సదస్సును ఉద్దేశించి ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ప్రసంగిస్తూ.. మహిళలపై అఘాయిత్యాలు, పిల్లల భద్రతపై సమాజంలో తీవ్రమైన ఆందోళన నెలకొంది.. దేశంలో మహిళల భద్రత కోసం అనేక కఠినమైన చట్టాలు ఉన్నాయని తెలిపారు. 2019లో ప్రభుత్వం ఫాస్ట్ ట్రాక్ కోర్టులను ఏర్పాటు చేసింది అని గుర్తు చేశారు. జిల్లా మానిటరింగ్ కమిటీల పాత్ర చాలా కీలకం.. జిల్లా మానిటరింగ్ కమిటీల్లో డిస్ట్రిక్ట్ జడ్జ్, జిల్లా కలెక్టర్, జిల్లా ఎస్పీలు ఉంటారు అని ఆయన చెప్పుకొచ్చారు. న్యాయ వ్యవస్థలోని వివిధ అంశాల మధ్య సమన్వయం చేయడంలో జిల్లా కమిటీల పాత్ర చురుకుగా ఉండాల్సిన అవసరం ఉంది.. మహిళా అత్యాచార ఘటనల్లో వీలైనంత త్వరగా న్యాయం జరగాలి.. సుప్రీంకోర్టు 75 ఏళ్ల ప్రయాణం, భారత ప్రజాస్వామ్యం.. న్యాయ వ్యవస్థపై ప్రతి ఒక్కరికి నమ్మకం ఉంది అని ప్రధాని మోడీ అన్నారు.

Read Also: Radikaa Sarathkumar: సీక్రెట్‌ కెమెరాలు పెట్టి.. ప్రైవేట్‌ వీడియోలు చిత్రీకరించారు! రాధిక సంచలన వ్యాఖ్యలు

ఇక, సుప్రీంకోర్టుపై కానీ, న్యాయవ్యవస్థపై గాని అవిశ్వాసంగా మాట్లాడలేదు అని నరేంద్ర మోడీ అన్నారు. సుప్రీంకోర్టు 75 వసంతోత్సవం వేడుకలను చేసుకుంటుందన్నారు. మన దేశంలో న్యాయ వ్యవస్థ ప్రజాస్వామ్యానికి రక్షణగా నిలుస్తుంది అన్నారు. గత పదేళ్లలో కోర్టుల మోడరనైజేషన్ కోసం ప్రత్యేక కార్యక్రమాలను చేపట్టాం.. ఈ రెండు రోజుల న్యాయ సదస్సులో చాలా కీలకమైనటువంటి చర్చ జరగనుంది.. 140 కోట్ల మంది దేశ ప్రజల సంకల్పం ఒకటే వికసిత్ భారత్.. భారత న్యాయ వ్యవస్థకు జిల్లా కోర్టులు చాలా కీలకం అని ఆయన పేర్కొన్నారు. జిల్లా కోర్టులో నాలుగున్నర కోట్ల కేసులు పెండింగ్లో ఉన్నాయి.. తొందరలోనే వాటిని క్లియర్ చేసేలా ప్రణాళికలు ఏర్పాటు చేయాలని ప్రధాని మోడీ కోరారు.