Site icon NTV Telugu

Dog Attacks Security Guard: సెక్యూరిటీ గార్డ్ మెడపై వీధికుక్క దాడి .. కొద్దిలో తప్పించుకున్న గార్డ్

Untitled Design (2)

Untitled Design (2)

ఇటీవల వీధి కుక్కలు రెచ్చిపోతున్నాయి. పిల్లల నుంచి పెద్దల వరకు ఒంటిరిగా కనిపిస్తే చాలు మీదపడి కరిచేస్తున్నాయి. తాజాగా ఓ సెక్యూరిటీ గార్డ్ మెడపై దాడి చేయబోయింది కుక్క. తృటిలో ఆ కుక్క బారి నుంచి తప్పించుకున్నాడు ఆ వ్యక్తి. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

పూర్తి వివరాల్లోకి వెళితే.. ప్రస్తుతం వీధి కుక్కలు ఎక్కడపడితే.. అక్కడ దాడులకు తెగబడుతున్నాయి. ఈ వీధి కుక్కల దాడిలో ఎంతో మంది ప్రాణాలు కూడా కోల్పోయారు. అయితే.. ముంబై గోరేగావ్‌లోని సిద్ధార్థ్ నగర్‌లోని ఆదర్శ పాఠశాలలో వీధి కుక్క పాఠశాల సెక్యూరిటీ గార్డు మీదికి దూకి భుజాన్ని కరిచింది. కానీ ఆ దాడి నుంచి తప్పించుకున్నాడు సెక్యూరిటీ గార్డ్. ఈ దాడి ఘటన సీసీటీవీ కెమెరాలో రికార్డ్‌ కావడంతో వీడియో వెలుగులోకి వచ్చింది. కుక్క కరిచిన సంఘటన తర్వాత మరో సెక్యూరిటీ గార్డు ఆ వీధి కుక్కపై దాడి చేయడం కూడా వీడియోలో కనిపించింది.

అయితే.. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. వీడియో చూసిన నెటిజన్లు మన్సిపాలిటీ అధికారులు, సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వీధి కుక్కల బెడదపై అధికారులు తక్షణమే చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేస్తున్నారు.

Exit mobile version