Site icon NTV Telugu

Madhya Pradesh: ఇన్నాళ్లు ప్రజలు పూజించింది రాళ్లను కాదా..?డైనోసార్ గుడ్లనా..?

Dinosaur Eggs

Dinosaur Eggs

Madhya Pradesh: మధ్యప్రదేశ్ లోని ధార్ జిల్లాలోని ఓ గ్రామంలో గత కొన్ని ఏళ్లుగా రాళ్లను దేవతలుగా పూజిస్తున్నారు. అక్కడి ప్రధాన సంప్రదాయాల్లో ఈ రాళ్లకు ప్రత్యేకస్థానం ఉంది. అయితే తాజాగా తేలింది ఏంటంటే.. అసలు ఇవి రాళ్లే కావని, డైనోసార్లకు సంబంధించిన గుడ్లు అని తేలింది. అక్కడి ప్రజలు వీటిని తమ కుటుంబ దేవతలుగా కొన్నేళ్లుగా పూజిస్తున్నట్లు శాస్త్రవేత్తలు కనుగొన్నారు.

ఈ గ్రామానికి నర్మదా వ్యాలీ ప్రాంతంలోని లక్షల ఏళ్ల నాటి డైనోసార్ యుగంతో సంబంధం ఉంది. ప్రస్తుతం స్థానిక అధికారులు దర్యాప్తు ప్రారంభించారు. డైనోసార్ శిలాజాలకు ముగ్గురు శాస్త్రవేత్తలు డాక్టర్ మహేష్ ఠక్కర్, డాక్టర్ వివేక్ వి కపూర్, డాక్టర్ శిల్పాల ఇటీవల కొనుగొన్నారు.

Read Also: Pallavi Prashanth Arrested: బిగ్ బ్రేకింగ్: పల్లవి ప్రశాంత్ అరెస్ట్?

వెస్టా పటేల్ అనే స్థానికుడు ఈ గుండ్రని డైనోసార్ శిలాజాలను పూజించే సంప్రదాయాన్ని ‘కాకడ్ భైరవ్’’ లేదా ‘‘భైలాట్ బాబా’’ గురించి పరిశోధకులకు తెలియజేశాడు. వాటిలో కొన్ని డైనోసార్ గుడ్లు ఉన్నట్లు పరిశోధకులు కనుగొన్నాడు. కాకడ్ అని పిలువబడే ఈ డైనోసార్ రాళ్లను పొలాల సరిహద్దుల్లో ఉంచి పూజిస్తారు.

ఆ ప్రాంతంలో కుటుంబ దేవతలుగా భావించే గుండ్రని ఈ శిలాజాలు పూజా ఆచారాల్లో ముఖ్యమైన పాత్రను పోషిస్తాయని, తరుచుగా చెట్ల కింద ఉంచి పూజిస్తారని పరిశోధకులు తెలుపుతున్నారు. ఈ రాళ్లకు కొబ్బరికాయల్ని నైవేధ్యంగా పెట్టేవారని, ప్రస్తుతం ఈ రాళ్లు డైనోసార్ గుడ్లు అని తేలడంతో ప్రజలు ఆశ్చర్యాన్ని వ్యక్తం చేస్తున్నారు.

జిల్లాలో ఇప్పటి వరకు 250 పైగా డైనోసార్ గుడ్లు దొరికాయి. మధ్యప్రదేశ్‌లోని నర్మదా లోయలో డైనోసార్‌లు ఉండేవని నమ్ముతున్నారు. దాదాపు 175 మిలియన్ సంవత్సరాల క్రితం డైనోసార్‌లు భూమిపై సంచరించాయని శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు. 65 మిలియన్ సంవత్సరాల క్రితం ఈ జాతులు అంతరించిపోయాయి.

Exit mobile version