NTV Telugu Site icon

Vande Bharat Express: వందేభారత్ ఎక్స్‌ప్రెస్‌పై మరోసారి రాళ్లదాడి..

Vande Bharat

Vande Bharat

Vande Bharat Express: యాక్సిడెంట్లు, రాళ్ల దాడులతో వందేభారత్ ఎక్స్‌ప్రెస్‌ వార్తల్లో నిలుస్తోంది. భారత రైల్వే, మోదీ సర్కార్ ఎంతో ప్రతిష్టాత్మంగా తీసుకువచ్చిన సెమీ హైస్పీడ్ వందేభారత్ రైలుపై ఇటీవల కాలంలో వరసగా దాడులు జరుగుతున్నాయి. కొందరు దుండగులు రైలుపై రాళ్లతో దాడులు చేస్తున్నారు. తాజాగా పశ్చిమ బెంగాల్ ముర్షిదాబాద్ జిల్లా ఫరక్కా సమీపంలో శనివారం అర్థరాత్రి రైలుపై కొందరు దుండగులు రాళ్లతో దాడి చేశారు. రైలు హౌరా నుంచి న్యూ జల్‌పైగురి వెళ్తోంది.

Read Also: Womens nude photos scam : పూజల పేరుతో మహిళల నగ్నచిత్రాలు తీసిన గ్యాంగ్.. పరారీలో నిందితుడు

ఈ ఘటనలో రైలు బోగీ కిటికీ అద్దాలు ధ్వంసం అయ్యాయని తూర్పు రైల్వే ఓ ప్రకటనలో తేలిపింది. దీనిపై విచారణ జరుపుతున్నామని రైల్వే అధికారులు వెల్లడించారు. ముఖ్యంగా పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో ఇటీవల వరసగా దాడులు జరుగుతున్నాయి. జనవరి నెలలో డార్జిలింగ్ జిల్లాలోని ఫన్‌సీదేవా ప్రాంతానికి సమీపంలో రెండు కోచ్‌లపై రాళ్లు రువ్వడంతో వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైలు కిటికీ అద్దాలు దెబ్బతిన్నాయని రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ తెలిపింది. ఆ తరువాత మాల్దా సమీపంలోని హౌరా నుండి న్యూ జల్‌పైగురికి వెళ్తున్న రైలుపై రాళ్లు రువ్వడంతో వందే భారత్ ఎక్స్‌ప్రెస్ కిటికీ అద్దాలు పగిలిపోయాయి. జనవరి నెలలో ఇది రెండో దాడి. తాజాగా మరోసారి ముర్షిదాబాద్ లో మరోసారి దాడికి గురైంది.

వరస దాడులు:

ఫిబ్రవరిలో సికింద్రాబాద్‌-విశాఖపట్నం వందేభారత్‌ ఎక్స్‌ప్రెస్‌ తెలంగాణలోని మహబూబాబాద్‌ జిల్లా గుండా వెళుతుండగా దుండగులు రాళ్లతో దాడి చేశారు. జనవరిలో విశాఖపట్నం కంచరపాలెం వద్ద మద్యం మత్తులో దుండగులు రాళ్లదాడి చేయడంతో అదే మార్గంలో వెళ్లే రైలు దెబ్బతింది. ఫిబ్రవరి 23న, కొందరు దుండగులు రైలుపై రాళ్లు రువ్వడంతో వందే భారత్ మైసూరు-చెన్నై ఎక్స్‌ప్రెస్ అద్దాలు పగిలాయి. బీహార్‌లోని కతిహార్‌ మీదుగా రైలు వెళుతుండగా రైలుపై దాడి జరిగింది.