Doctors Cheating: ఏం వైద్యులు రా.. బాబు..! గర్భాశయం తొలగిస్తామని కిడ్నీలే మాయం చేశారు..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
వైద్యం అంటే మామూలుగా వుండదు మరి. ఓ మహిళ తీవ్ర కడుపు నొప్పితో వైద్యుల దగ్గరకు వెళ్లింది. తనకు కడుపు నొప్పిగా వుందని చెప్పడంతో.. వైద్యులు స్కానింగ్ చేయాలన్నారు. దీంతో ఆమె స్కానింగ్ చేయించగా వైద్యులు షాక్ తిన్నారు. ఆమెకు ఆవిషయం గురించి చెప్పగా బాధితురాలు షాక్ నుంచి తేరుకోలేక పోయింది. ఇంతకీ ఏం జరిగింది. వివరాల్లోకి వెళితే.. బీహార్‌లోని ముజఫర్‌పూర్ జిల్లాకు చెందిన సునీతాదేవి కి 33 ఏళ్లు. అమె తీవ్రమైన కడుపునొప్పితో స్థానికంగా ఉన్న ఓ ప్రైవేటు క్లినిక్‌కు వెళ్లింది. భరించలేని కడుపునొప్పి రావడంతో.. అక్కడున్న వైద్యులు టెస్టులు చేసి, తన గర్భాశయం తొలగించాలని చెప్పారు.
అయితే.. సునీతాదేవి కుటుంబసభ్యులు ఆపరేషన్ రూ. 30 వేలకు జరిగేలా మాట్లాడుకున్నారు. దీంతో.. సెప్టెంబర్ 3వ తేదీన శస్త్రచికిత్స విజయవంతంగా పూర్తయింది. ఇక ఆ మరుసటి రోజు నుంచే సునీతా దేవి ఆరోగ్య పరిస్థితి మరింతగా దిగజారింది. భరించలేక ఆమె కుటుంబ సభ్యులు సెప్టెంబర్ 5వ తేదీన పాట్నా మెడికల్ హాస్పిటల్‌కు తరలించారు. సునీతాను డాక్టర్లు పరీక్షించి.. షాకింగ్ నిజాన్ని చెప్పారు. తన శరీరంలో రెండు కిడ్నీలు లేవని తెలిపారు. అవాక్కైన కుటుంబ సభ్యులు కడుపునొప్పితో ఆస్పత్రికి వెళ్తే, కిడ్నీలు తీసేయడమేంటని లబోదిబోమన్నారు. కాగా.. సదరు క్లినిక్ నిర్వాహకుడిపై బాధితురాలి కుటుంబసభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేసారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు అతడిపై మానవ అవయవాల మార్పిడి చట్టం కింద కేసు నమోదు చేసి అదుపులోకి తీసుకున్నారు. దీనిపై లోతుగా విచారణ జరుపుతామని అధికారులు తెలిపారు.
Cm Jagan: రూ.1000 కోట్ల రుణం కోసం ఏపీ సర్కార్ ప్రయత్నాలు
Also Read
- Siddaramaiah: కర్ణాటకలో ఉత్కంఠకు తెర.. గురువారం గుడ్‌బై చెప్పనున్న సిద్ధరామయ్య!
- Karnataka: కర్ణాటక కుర్చీ పంచాయితీ తుస్.. హైకమాండ్ చర్చలు అందుకోసమంట!
- US: అమెరికాలో ఘోరం.. స్టోర్‌లో భారతీయ మహిళను కాల్చి చంపిన దుండగుడు.. వీడియో వైరల్
- Mamata Banerjee: కదులుతున్న తృణమూల్ పునాదులు.. వరుస షాక్‌లతో దీదీ విలవిల..
తాజావార్తలు
-
Siddaramaiah: కర్ణాటకలో ఉత్కంఠకు తెర.. గురువారం గుడ్‌బై చెప్పనున్న సిద్ధరామయ్య!
-
Khaja Mohijuddin: వక్ఫ్ బోర్డు భూముల పోరాటమే ప్రాణం తీసిందా? సెకండ్ హ్యాండ్ ‘స్కార్పియో’తో లాయర్‌ను లేపేసిన కిల్లర్స్!
-
Vizag Bhimili Murder: ప్రియుడి మోజులో పచ్చని సంసారంలో నిప్పులు.. భర్తను చున్నీతో చంపేసిన ఇల్లాలు!
-
Story Board : పెట్రోల్ భారం.. దేశంలో పెరుగుతున్న ద్రవ్యోల్బణం.. ఆర్థిక వ్యవస్థ ఎటు వైపు?
-
GT vs RCB: సిక్సర్ల సునామీ.. స్టేడియంలో ఆర్సీబీ శివతాండవం! గుజరాత్ టైటాన్స్ గెలవాలంటే 255 కొట్టాల్సిందే..
ట్రెండింగ్
-
రూ.11,999కే 6000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో Lava SHARK 2 5G లాంచ్..!
-
వాతావరణం మారితే కలర్ మారుతున్న ఫోన్.. 12 కలర్ వేరియంట్స్, సరికొత్త AI ఫీచర్లతో Infinix HOT 70 లాంచ్.!
-
Nitish Kumar Reddy Birthday: టెక్నిక్ + టాలెంట్ + టెంపరమెంట్.. విశాఖ కుర్రాడి జర్నీ.!
-
Chicken Pickle Recipe: 4 నెలలు పాడవకుండా ఉండే ఆంధ్ర స్టైల్ స్పైసీ ‘చికెన్ పచ్చడి’.. ఒకసారి తింటే మళ్లీ మళ్లీ తినాలినిపించేలా చేయండి ఇలా.!
-
AIతో ఇంటర్వ్యూ మోసాలు.. కంపెనీల కొత్త ప్లాన్.!