Sambhal: ఇటీవల మసీదు సర్వే సమయంలో అల్లర్లు జరగడంతో ఒక్కసారి ఉత్తర్ ప్రదేశ్‌లోని సంభాల్ నగరం వార్తల్లోకి వచ్చింది. ఈ అల్లర్ల తరువాత జరిగిన పరిణామాల్లో సంభాల్‌లో అనేక పురాతన హిందూ దేవాలయాలు, బావులు బయటపడ్డాయి. తాజాగా శనివారం సర్వే చేస్తుందడగా సంభాల్‌లోని లక్ష్మణ్ గంజ్ ప్రాంతంలో ‘‘మెట్ల బావి’’ వెలుగులోకి వచ్చింది. 1857 తిరుగుబాటు కాలం నాటి 250 అడుగుల లోతున్న మెట్ల బావిని కనుగొన్నారు.
నివేదిక ప్రకారం.. ఈ నెల ప్రారంభంలో అదే ప్రాంతంలో పురాతన బాంకే బిహారీ ఆలయ శిథిలాలను కొనుగొన్నారు. దీని తర్వాత తాజాగా ‘‘రాణి కి బావడి’’ అనే మెట్ల బావిని కనుగొనడటం జరిగింది. సంభాల్ జిల్లా మేజిస్ట్రేట్ రాజేంద్ర పెన్సియా ఆదివారం రోజు 400 చదరపు మీటర్ల విస్తీర్ణం ఉన్న బావిని కనుగొన్నట్లు ధృవీకరించారు. చుట్టూ నాలుగు గదులు ఉన్న ఈ నిర్మాణంలో పాలరాతితో చేసిన కొన్ని అంతస్తులు ఉణ్నాయని తెలిపారు.
Read Also: Arvind Dharmapuri: ఆర్ఓబి పెండింగ్ బిల్లులు మంజూరు చేయండి.. సీఎంని కోరిన ఎంపీ అర్వింద్
శుక్రవారం, భారత పురావస్తు శాఖ(ఏఎస్ఐ) సంభాల్‌లోని కార్తికేయ ఆలయంలో కార్బన్ డేటింగ్ నిర్వహించింది. 46 ఏళ్ల తర్వాత డిసెంబర్ 13న ఈ ఆలయాన్ని తిరిగి తెరిచారు. 1978 మత అల్లర్ల తర్వాత ఈ ప్రాంతం నుంచి హిందువులు వెళ్లిపోయారు. అప్పటి నుంచి ఆలయం మూసేసి ఉంది. దీంతో పాటు భద్రక్ ఆశ్రమం, స్వర్గ్‌దీప్, చక్రపాణి సహా పరిసర ప్రాంతాల్లోని ఐదు పుణ్యక్షేత్రాలను పరిశీలించడంతో పాటు 19 బావుల్ని సర్వే చేశారు.
సంభాల్‌లో ఆక్రమణలకు నిరోధిస్తూ బుల్డోజర్ యాక్షన్ తీసుకున్న సమయంలో ఈ ఆలయాలు వెలుగులోకి వచ్చాయి. ఈ ఆలయం వివాదాస్పద షాహీ జామా మసీదు నుంచి కూతవేటు దూరంలో ఉంది. నవంబర్ 24న కోర్టు ఆదేశాలతో మసీదు సర్వేకి వెళ్లిన సమయంలో ఒక గుంపు అధికారులపై దాడులు చేసింది. ఈ ఘటనలో ఐదుగురు వ్యక్తులు మరణించారు. దీంతో ఈ ఘటన దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. దీని తర్వాత నుంచి ఆ ప్రాంతంలో ఆక్రమణపై యోగి సర్కార్ ఉక్కుపాదం మోపింది. ఈ సమయంలోనే పురాతన కట్టడాలు వెలుగులోకి వస్తున్నాయి.