ఐఎన్ఎస్ విశాఖపట్నం రాకతో నౌకదళ బలం పెరిగింది: రాజ్‌నాథ్‌సింగ్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
భారత తొలి ‘స్టెల్త్ గైడెడ్ మిసైల్ డెస్ట్రాయర్’ ఐఎన్ఎస్ విశాఖపట్నం నేడు ముంబయి విధుల్లో చేరింది. ఈ కార్యక్రమంలో రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ సహా పలువురు నౌకాదళ ఉన్నాతాధికారులు పాల్గొ న్నారు. ఈ సందర్భంగా రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్ మాట్లా డారు. రాజ్‌నాథ్ సింగ్ అధికారులతో కలిసి ఐఎన్ఎస్ విశాఖపట్నం ప్రత్యేకతలను పరిశీలించారు. దీని రాకతో హిందూ మహాసముద్రంలో నౌకదళంలో భారత్ బలం మరింతగా పెరిగిందన్నారు. భారత్‌పై ఆధిపత్యం చెలాయించాలనుకునే దేశాలకు తగిన గుణపాఠం చెబుతామని చైనాను పరోక్షంగా హెచ్చరించారు రాజ్‌నాథ్ సింగ్.
అంతర్జాతీయ సరిహద్దులను ఉల్లంఘిస్తూ సముద్రజలాల ఆక్రమణకు పాల్పడుతున్నాయని అలాంటి దేశాలకు భారత్ ఖచ్చితంగా బుద్ధి చెబుతుందన్నారు. ఇప్పటికైనా అంతర్జాతీయ సరిహద్దులను ఉల్లం ఘించొద్దని, ఉల్లంఘిస్తే భారత్ ధీటైన సమాధానం చెబుతుం దని రాజ్‌నాథ్ సింగ్ చైనాను ఉద్దేశించి అన్నారు. ప్రాజెక్టు 15బీ పేరుతో మొత్తం నాలుగు అత్యంత అధునాతన నౌకలను తయారు చేస్తు న్నారు. ముంబయి మజగాన్ డాక్‌లో ఈ నౌకను నిర్మించారు. నౌకలకు ప్రముఖ నగరాల పేర్లను పెట్టడం సంప్రదాయంగా పాటిస్తున్నారు. అందుకు అనుగుణంగా ఈ నౌకకు ‘ఐఎన్ఎస్ విశాఖపట్నం’గా నామకరణం చేశారు.
Also Read
- Gyanesh Kumar: ప్రతిపక్షాల విమర్శల మధ్య CEC జ్ఞానేష్ కుమార్.. ఆయన ఎవరు, నేపథ్యం ఏమిటి?
- Jaishankar-Rubio: రూబియోతో జైశంకర్ భేటీ.. రష్యా ఆంక్షల బిల్లుపై అభ్యంతరం
- Bihar: లైంగిక కేసు నిందితుడి చెంప పగలగొట్టిన న్యాయవాది
- B.Tech Degree: ఇక నుంచి బీటెక్ 5 సంవత్సరాలు.. ప్రతిపాదించిన ఢిల్లీ ఐఐటీ మాజీ డైరెక్టర్..
ఇవే ప్రత్యేకతలు..
ఈ నౌక కదలికల్ని శత్రుదేశ రాడార్లు గుర్తించలేవు. ఇందుకోసం అధునాతన పరిజ్ఞానాన్ని ఉపయోగించారు.రెండు మల్టీరోల్ హెలీకాప్టర్లు ఇందులో ఉంటాయి. బ్రహ్మోస్ సూపర్ సోనిక్ క్షిపణులతో సహా పలు రకాల క్షిపణులను ఈ నౌక నుంచి ప్రయోగించవచ్చు.జలాంతర్గాములను కూడా ఇది గుర్తించి దాడి చేయగలదు. తీర నౌకదళంలో గస్తీతో పాటు కఠినమైన పరిస్థితుల్లో యుధ్దనౌకగా కూడా దీనిని వినియోగించుకోవచ్చు.
Attended the commissioning ceremony of INS Visakhapatnam into Indian Navy today. This indigenously developed missile destroyer is packed with state-of-the-art weapons & modern technology. It is a symbol of India’s growing maritime prowess.@indiannavy https://t.co/kpQCUHiGy8 pic.twitter.com/7G35fFlzQ1
— Rajnath Singh (@rajnathsingh) November 21, 2021
తాజావార్తలు
-
AP Severe Depression Landfall: తీరాన్ని తాకిన తీవ్ర వాయుగుండం.. 70 కి.మీ వేగంతో గాలులు
-
Coal Supply : యాదాద్రి ప్లాంట్‌పై సీఎం ఫోకస్.. దసరాకల్లా ఫుల్ పవర్
-
Japan Captain: వైభవ్ సూర్యవంశీ ఆడతాడని అనుకున్నా.. జపాన్ కెప్టెన్ అసంతృప్తి..
-
AP Liquor Shops: లిక్కర్ షాపులపై కీలక నిర్ణయం.. ఇక రెన్యువల్ గడువు పొడిగింపు లేదు..!
-
OTR: దేవుడి సాక్షిగా రాజకీయ పోరు.. కాణిపాకం చుట్టూ చిత్తూరు పాలిటిక్స్
ట్రెండింగ్
-
Veg Soup: వర్షంలో వేడివేడిగా హోటల్ రుచిని తలదన్నేలా ‘వెజ్ సూప్’ ఇంట్లోనే.. సులువుగా చేసేయండి ఇలా..!
-
IP69K రేటింగ్, 8000mAh బ్యాటరీ, 144Hz AMOLED డిస్ప్లేతో సెప్టెంబర్ 29న రానున్న OPPO K14 Plus..!
-
IP66+IP68+IP69 రేటింగ్స్, 200MP+200MP కెమెరాలు, 8000mAh బ్యాటరీతో OPPO Find X10 సిరీస్ లాంచ్.!
-
Match-Fixing: నన్ను ఇరికించే ప్రయత్నం చేశారు.. భారత క్రికెట్లో మ్యాచ్ ఫిక్సింగ్ కలకలం!
-
ట్రిపుల్ 200MP కెమెరాలు, 1.5K 144Hz OLED డిస్‌ప్లే, 8000mAh బ్యాటరీతో OPPO Find X10 Pro Max ఫ్లాగ్షిప్ లాంచ్.!