PM Modi: ఈ రోజు (ఫిబ్రవరి 17) తెల్లవారు జామున దేశ రాజధాని ఢిల్లీ సహా ఉత్తర భారత దేశంలోని పలు రాష్ట్రాల్లో సంభవించిన స్వల్ప భూ ప్రకంపనలపై ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ రియాక్ట్ అయ్యారు. ఏ ఒక్కరూ కూడా ఎలాంటి భయాందోళనకు గురి కావొద్దు.. అందరు ప్రశాంతంగా ఉండాలని ఆయన సూచించారు. అధికారులు ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని పిలుపునిచ్చారు. అయితే, మరోసారి భూ ప్రకంపనలు వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి.. కావున, ఈ నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని చెప్పుకొచ్చారు.
Read Also: Gold Mines: బంగారు గనిలో ఘోర ప్రమాదం.. 48 మంది దుర్మరణం
అయితే, ఢిల్లీ నోయిడా, ఘజియాబాద్, గురుగ్రామ్ ప్రాంతాల్లో ఈరోజు తెల్లవారు జామున కొద్ది సెకన్ల పాటు భూమి ఒక్కసారిగా కంపించింది. రిక్టర్ స్కేల్‌పై భూకంప తీవ్రత 4.0గా నమోదు అయింది. కాగా, ఉదయం 5:36 గంటలకు ఢిల్లీతో పాటు నేషనల్ క్యాపిటల్ రీజియన్-ఎన్‌సీఆర్ ప్రాంతాల్లో భూ ప్రకంపనలు సంభవించాయి. ఇక, ప్రాణ భయంతో ఢిల్లీ వాసులు ఇళ్ల నుంచి బయటికి పరుగులు తీశారు.