Stampede in Air India Recruitment Drive: మొన్న గుజరాత్.. నేడు ముంబై.. రిక్రూట్మెంట్ డ్రైవ్‌లో తొక్కిసలాట..
- ఎయిర్ ఇండియా వాకిన్‌లో తొక్కిసలాట..
- ఎయిర్పోర్ట్ లోడర్ల కోసం వాకిన్ ఇంటర్వ్యూ..
- 2216 ఖాళీల కోసం 25000 కంటే ఎక్కువ మంది దరఖాస్తు..
- పెద్ద ఎత్తున యువత తరలిరావడంతో.. తొక్కిసలాట..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Stampede in Air India Recruitment Drive: ప్రభుత్వాధినేతలు ఎన్ని చెబుతున్నా.. ఎన్ని సంస్థలు వస్తున్నా.. నిరుద్యోగం మాత్రం రోజురోజుకూ పెరిగిపోతూనే ఉంది.. మొన్నకు మొన్నే గుజరాత్ రాష్ట్రంలోని భారుచ్ జిల్లా అంకాళేశ్వర్ సిటీలో.. ఓ ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగం కోసం పెద్ద సంఖ్యలో నిరుద్యోగులు తరలిరావడంతో.. తోపులాట.. తొక్కిసలాట జరిగిన విషయం మరవక ముందే.. ఇప్పుడు అలాంటి ఘటన ముంబైలో చోటు చేసుకుంది.. ఎయిర్ ఇండియా రిక్రూట్మెంట్ డ్రైవ్‌కు పెద్ద ఎత్తున నిరుద్యోగుల రావడంతో అక్కడ కూడా తొక్కిసలాట జరిగింది..
Read Also: Nani: మరో సీక్వెల్ లో న్యాచురల్ స్టార్ నాని..దర్శకుడు ఎవరంటే..?
Also Read
- Modi-Netanyahu: మోడీకి నెతన్యాహు ఫోన్.. ఉద్రిక్తతల వేళ కీలక సంభాషణ
- West Bengal: మసీదు లౌడ్‌స్పీకర్లపై బెంగాల్లో రగడ.. అమిత్ షా ముందు పంచాయతీ..
- Mohan Bhagwat: జెన్-జీతో దేశద్రోహులైపోతారా? నిరసనలో తప్పేముంది? మోహన్ భగవత్ కీలక వ్యాఖ్యలు
- Raksha Bandhan 2026: రక్షా బంధన్ 2026 ఎప్పుడు..? రాఖీ కట్టేందుకు శుభ ముహూర్తం.. గ్రహణం ప్రభావం ఉంటుందా?
ఎయిర్ ఇండియా వాకిన్‌లో జరిగిన తొక్కిసలాట విషయానికి వస్తే.. ఎయిర్పోర్ట్ లోడర్ల కోసం .. వాకిన్ ఇంటర్వ్యూలో పెట్టింది. 2 వేలకు పైగా పోస్టుల కోసం జరిగిన వాకిన్కు దాదాపు 25 వేల మందికి పైగా నిరుద్యోగులు తరలివచ్చారు.. దీంతో ఎయిర్‌పోర్టు వద్ద పరిస్థితి అదుపు తప్పింది… యువకుల మధ్య తోపులాట జరిగి తొక్కిసలాటకు దారితీసింది.. 2,216 ఖాళీల కోసం 25,000 కంటే ఎక్కువ మంది దరఖాస్తుదారులు వచ్చారు.. వారాన్ని నియంత్రించడం ఎయిర్ ఇండియా సిబ్బందికి కష్టంగా మారిపోయింది.. ఫారమ్ కౌంటర్లను చేరుకోవడానికి దరఖాస్తుదారులు ఒకరిని ఒకరు నెట్టుకుంటూ ముందుకు వెళ్లారు.. అంతేకాదు.. దరఖాస్తుదారులు.. ఆహారం.. మంచినీళ్లు కూడా లేకుండా గంటల తరబడి వేచి ఉండాల్సిన పరిస్థితి వచ్చింది..
Read Also: Devshayani Ekadashi 2024: నేడు తొలి ఏకాదశి.. ఈ 6 పరిహారాలు చేస్తే ఆర్థిక సమస్యలు అవుట్!
ఎయిర్పోర్ట్ లోడర్ల జీతం నెలకు రూ. 20,000 నుండి రూ.25,000 వరకు ఉంటుంది, అయితే చాలా మంది ఓవర్‌టైమ్ అలవెన్సులు కలుపుకుని రూ. 30,000 కంటే ఎక్కువ సంపాదిస్తారు. ఉద్యోగం కోసం విద్యా ప్రమాణాలు ప్రాథమికమైనవే.. కానీ, అభ్యర్థి శారీరకంగా బలంగా ఉండాలి. అభ్యర్థుల్లో ఒకరు బుల్దానా జిల్లాకు చెందిన ప్రథమేశ్వర్ ఇంటర్వ్యూ కోసం 400 కిలోమీటర్లకు పైగా ప్రయాణించానని చెప్పుకొచ్చాడు.. డిగ్రీ పట్టాలు పట్టుకొని చాలా మంది ఆ ఇంటర్వ్యూలకు వచ్చారు.. గుజరాత్‌లోని భరూచ్ జిల్లాలోని అంక్లేశ్వర్‌లో జరిగిన వాక్-ఇన్ ఇంటర్వ్యూలో వందలాది మంది ఉద్యోగార్థులు ఒకరినొకరు తోసుకుంటూ.. కిందపడిపోయిన వీడియో వైరల్ అయిన కొద్ది రోజుల్లోనే ఇప్పుడు ముంబైలో ఈ ఘటన జరిగింది.
Walk-in interview at Air India Airport Services Ltd. in Kalina, Mumbai. pic.twitter.com/BnTfMCx4uq
— Citizen Kau (@citizen_kau) July 17, 2024
తాజావార్తలు
-
Arun Matheswaran: స్టార్ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్‌ను హీరోగా ఎలా ఒప్పించాడో చెప్పిన డీసీ డైరెక్టర్!
-
YSP MPs Meet Amit Shah: అమిత్ షాతో వైసీపీ ఎంపీల భేటీ.. జగన్ భద్రత, డీఎస్సీ అక్రమాలపై ఫిర్యాదు
-
Fake NOC Colleges: ఫేక్ ఫైర్ ఎన్ఓసీలతో అనుమతులు పొందిన 52 కళాశాలలు.. కాలేజీల పూర్తి లిస్ట్ ఇదే..
-
Modi-Netanyahu: మోడీకి నెతన్యాహు ఫోన్.. ఉద్రిక్తతల వేళ కీలక సంభాషణ
-
Botsa Satyanarayana: డీఎస్సీ అక్రమాలపై సీబీఐ విచారణ జరపాలి.. మంత్రి లోకేష్ రాజీనామా చేయాలి..
ట్రెండింగ్
-
రూ.9.99 లక్షలకే పెట్రోల్, డీజిల్, CNG ఆప్షన్లతో Tata Nexon Camo ఎడిషన్ లాంచ్..!
-
6.99 అంగుళాల 120Hz OLED డిస్ప్లే, 8,000mAh బ్యాటరీతో REDMI Note 17 5G లాంచ్..!
-
Crispy Wheat Flour Snacks: బయటి జంక్ ఫుడ్‌కి బై..బై.. ఇంట్లోనే గోధుమపిండితో కరకరలాడే హెల్తీ స్నాక్స్ చేసేయండి ఇలా.!
-
Best EV Bikes: బెస్ట్ మైలేజ్, అదిరే ఫీచర్లతో రూ.1.50 లక్షలలోపు కొనుగోలు చేయగల టాప్-5 EV బైక్‌లు ఇదిగో..!
-
Incredible Story: దేశవాళీ క్రికెట్లో 9 వేల రన్స్.. టీమిండియా డెబ్యూలోనే హాఫ్ సెంచరీ.. కానీ అడ్రస్ లేకుండా పోయిన ఓపెనర్!