NTV Telugu Site icon

Stampede in Air India Recruitment Drive: మొన్న గుజరాత్‌.. నేడు ముంబై.. రిక్రూట్మెంట్ డ్రైవ్‌లో తొక్కిస‌లాట..

Stampede

Stampede

Stampede in Air India Recruitment Drive: ప్రభుత్వాధినేతలు ఎన్ని చెబుతున్నా.. ఎన్ని సంస్థలు వస్తున్నా.. నిరుద్యోగం మాత్రం రోజురోజుకూ పెరిగిపోతూనే ఉంది.. మొన్నకు మొన్నే గుజరాత్ రాష్ట్రంలోని భారుచ్ జిల్లా అంకాళేశ్వర్ సిటీలో.. ఓ ప్రైవేట్‌ కంపెనీలో ఉద్యోగం కోసం పెద్ద సంఖ్యలో నిరుద్యోగులు తరలిరావడంతో.. తోపులాట.. తొక్కిసలాట జరిగిన విషయం మరవక ముందే.. ఇప్పుడు అలాంటి ఘటన ముంబైలో చోటు చేసుకుంది.. ఎయిర్‌ ఇండియా రిక్రూట్మెంట్‌ డ్రైవ్‌కు పెద్ద ఎత్తున నిరుద్యోగుల రావడంతో అక్కడ కూడా తొక్కిసలాట జరిగింది..

Read Also: Nani: మరో సీక్వెల్ లో న్యాచురల్ స్టార్ నాని..దర్శకుడు ఎవరంటే..?

ఎయిర్ ఇండియా వాకిన్‌లో జరిగిన తొక్కిస‌లాట‌ విషయానికి వస్తే.. ఎయిర్‌పోర్ట్ లోడ‌ర్ల కోసం .. వాకిన్ ఇంట‌ర్వ్యూలో పెట్టింది. 2 వేలకు పైగా పోస్టుల కోసం జ‌రిగిన వాకిన్‌కు దాదాపు 25 వేల మందికి పైగా నిరుద్యోగులు తరలివచ్చారు.. దీంతో ఎయిర్‌పోర్టు వ‌ద్ద ప‌రిస్థితి అదుపు త‌ప్పింది… యువకుల మధ్య తోపులాట జరిగి తొక్కిసలాటకు దారితీసింది.. 2,216 ఖాళీల కోసం 25,000 కంటే ఎక్కువ మంది దరఖాస్తుదారులు వచ్చారు.. వారాన్ని నియంత్రించడం ఎయిర్ ఇండియా సిబ్బందికి కష్టంగా మారిపోయింది.. ఫారమ్ కౌంటర్‌లను చేరుకోవడానికి దరఖాస్తుదారులు ఒకరిని ఒకరు నెట్టుకుంటూ ముందుకు వెళ్లారు.. అంతేకాదు.. దరఖాస్తుదారులు.. ఆహారం.. మంచినీళ్లు కూడా లేకుండా గంటల తరబడి వేచి ఉండాల్సిన పరిస్థితి వచ్చింది..

Read Also: Devshayani Ekadashi 2024: నేడు తొలి ఏకాదశి.. ఈ 6 పరిహారాలు చేస్తే ఆర్థిక సమస్యలు అవుట్!

ఎయిర్‌పోర్ట్ లోడర్‌ల జీతం నెలకు రూ. 20,000 నుండి రూ.25,000 వరకు ఉంటుంది, అయితే చాలా మంది ఓవర్‌టైమ్ అలవెన్సులు కలుపుకుని రూ. 30,000 కంటే ఎక్కువ సంపాదిస్తారు. ఉద్యోగం కోసం విద్యా ప్రమాణాలు ప్రాథమికమైనవే.. కానీ, అభ్యర్థి శారీరకంగా బలంగా ఉండాలి. అభ్యర్థుల్లో ఒకరు బుల్దానా జిల్లాకు చెందిన ప్రథమేశ్వర్ ఇంటర్వ్యూ కోసం 400 కిలోమీటర్లకు పైగా ప్రయాణించానని చెప్పుకొచ్చాడు.. డిగ్రీ పట్టాలు పట్టుకొని చాలా మంది ఆ ఇంటర్వ్యూలకు వచ్చారు.. గుజరాత్‌లోని భరూచ్ జిల్లాలోని అంక్లేశ్వర్‌లో జరిగిన వాక్-ఇన్ ఇంటర్వ్యూలో వందలాది మంది ఉద్యోగార్థులు ఒకరినొకరు తోసుకుంటూ.. కిందపడిపోయిన వీడియో వైరల్‌ అయిన కొద్ది రోజుల్లోనే ఇప్పుడు ముంబైలో ఈ ఘటన జరిగింది.