NTV Telugu Site icon

Sri Lanka: ఇంత సాయం చేసిన లంక బుద్ధి పోనిచ్చుకోలేదు.. భారత్ ఆందోళనలు బేఖాతరు..

China

China

Sri Lanka: భారత్‌పై నిఘా పెట్టేందుకు చైనా శ్రీలంకను పావుగా వాడుకుంటోంది. ఇప్పటికే శ్రీలంకకు ఇచ్చిన అప్పులకు బదులుగా ఆ దేశం హంబన్‌టోట నౌకాశ్రయాన్ని డ్రాగన్ కంట్రీకి లీజుకు ఇచ్చింది. తరుచుగా చైనాకు చెందిన పరిశోధన నౌకలు శ్రీలంక, మాల్దీవుల్లో లంగరు వేస్తున్నాయి. ఆర్థిక సంక్షోభం నుంచి బయటపడటానికి శ్రీలంకకు భారత్ భారీగా సాయం చేసినప్పటికీ, ఈ విషయాన్ని మరిచిపోయి మళ్లీ చైనా పాటనే పాడుతోంది. ప్రస్తుతం పరిశోధన నౌకలపై ఉన్న నిషేధాన్ని వచ్చే ఏడాదిని నుంచి ఎత్తేయాలని శ్రీలంక నిర్ణయించుకున్నట్లు జపాన్ మీడియా నివేదించింది. జపాన్ సందర్శించిన శ్రీలంక విదేశాంగ మంత్రి అలీ సబ్రీ తన వైఖరిని స్పష్టం చేశారు.

Read Also: JIO 5G Data : జియో వినియోగదారులు అపరిమిత 5G డేటా కావాలనుకుంటే ఈ రీఛార్జ్స్ చేయాల్సిందే..

హిందూ మహాసముద్రంలో చైనీస్ పరిశోధనా నౌకల కదలికలు పెరగడంతో, అవి గూఢచారి నౌకలు కావచ్చని న్యూఢిల్లీ ఆందోళన వ్యక్తం చేసింది. శ్రీలంక అటువంటి నౌకల్ని అనుమతించొద్దని కోరింది. భారత్ ఆందోళన నేపథ్యంలో జనవరి నెలలో ఇలాంటి నౌకలపై బ్యాన్ విధించింది. ఈ ఏడాది ప్రారంభంలో ఒక చైనా నౌకకు మినహాయింపు ఇచ్చింది. ఆ తర్వాత నిషేధం కొనసాగుతుందని పేర్కొంది.

ఇదిలా ఉంటే, తమ ప్రభుత్వం వివిధ దేశాలకు వేర్వేరు నిబంధనల్ని కలిగి ఉండదని, చైనాను మాత్రమే అడ్డుకోలేనిమ శ్రీలంక మంత్రి సబ్రీ అన్నారు. ఇతర దేశాల వివాదంతో శ్రీలంక ఎవరి పక్షం వహించదని స్పష్టం చేసినట్లు జపాన్ మీడియా శుక్రవారం నివేదించింది. ఈ నిషేధం వచ్చే ఏడాది జనవరి వరకు ఉంది. వచ్చే ఏడాది నుంచి శ్రీలంక తమ నౌకాశ్రయాల్లోకి విదేశీ పరిశోధన నౌకల్ని నిషేధించదని సబ్రీ చెప్పారు. నవంబర్ 2023 వరకు రెండు చైనా గూఢచారి నౌకల్ని తమ రేవుల్లో డాక్ చేయడానికి శ్రీలంక అనుమతించింది. యువాన్ వాంగ్ 5, షియాన్ 6 నౌకలు శ్రీలంకు వచ్చాయి.