Site icon NTV Telugu

Shubhanshu Shukla: శుభాంశు శుక్లా అంతరిక్ష యాత్రపై పార్లమెంట్‌లో ప్రత్యేక చర్చ.. విపక్షాలు బాయ్‌కట్

Shubhanshushukla

Shubhanshushukla

భారత వ్యోమగామి శుభాంశు శుక్లా అమెరికా నుంచి శనివారం ఢిల్లీకి చేరుకున్నారు. ఢిల్లీ ముఖ్యమంత్రి రేఖా గుప్తా, కేంద్రమంత్రులు, అధికారులు ఘన స్వాగతం పలికారు. తాజాగా సోమవారం పార్లమెంట్‌లో శుభాంశు శుక్ల అంతరిక్ష ప్రయాణంపై పార్లమెంటు ప్రత్యేక చర్చ చేపట్టింది. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ మాట్లాడుతూ.. పార్టీల మధ్య రాజకీయ విభేదాలు ఉన్నప్పటికీ.. భారతీయ  వ్యోమగామి శుభాంశు శుక్లాను గౌరవించడం పౌరులుగా బాధ్యత అన్నారు. ఈ సమయంలో రాజకీయాలను పక్కకు పెట్టాలని ప్రతిపక్ష నాయకులను కోరారు. ‘‘నేను మీకు విజ్ఞప్తి చేస్తున్నాను. మీకు ప్రభుత్వంపైనా… దేశం పట్ల గౌరవం లేకపోయినా… కనీసం అంతరిక్షంలోకి వెళ్లిన భారతీయుడి పట్ల గౌరవం చూపండి.’’ అని విపక్ష నాయకులను మంత్రి కోరారు. అలాగే కిరణ్ రిజుజు కూడా విజ్ఞప్తి చేశారు. ఆపరేషన్ సిందూర్‌పై చర్చలో పాల్గొన్నట్టుగా ఇప్పుడు కూడా పాల్గొనాలని కోరారు.

ఇది కూడా చదవండి: Pakistan: అసిమ్ మునీర్ వ్యాఖ్యలే రిపీట్ చేసిన పాక్ మంత్రి.. భారత్‌ను ఎలా పోల్చాడంటే..!

వ్యోమగామి శుభాంశు శుక్లాపై లోక్‌సభలో జరిగిన ప్రత్యేక చర్చకు ప్రతిపక్షాలు దూరంగా ఉన్నాయి. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ సీనియర్ ఎంపీ శశి థరూర్ మాత్రం సోషల్ మీడియా వేదికగా ప్రశంసలుు కురిపించారు. శుభాంశు శుక్లాను హీరోగా అభివర్ణించారు. గగన్‌యాన్‌కు ఒక మెట్టుగా పనిచేసిందని పేర్కొన్నారు.

ఇది కూడా చదవండి: Mumbai Rains: జలదిగ్బంధంలో ఆర్థిక రాజధాని.. జనజీవనం అస్తవ్యస్తం

జూన్ 25న చేపట్టిన యాక్సియం-4 మిషన్‌ ప్రయోగం విజయవంతమైంది. రోదసిలో 18 రోజులు గడిపారు. శుభాంశు శుక్లా బృందం జులై 15న భూమికి తిరిగి వచ్చింది. వచ్చిన వెంటనే వ్యోమగాములను క్వారంటైన్‌ సెంటర్‌కు తరలించారు. ఇక సోమవారం మోడీతో భేటీ అయ్యే అవకాశం ఉన్నట్లు అధికార వర్గాలు పేర్కొన్నాయి. ఈనెల 23న జరిగే జాతీయ అంతరిక్ష దినోత్సవంలో కూడా శుభాంశు శుక్లా పాల్గొంటారని వెల్లడించాయి.

Exit mobile version