Site icon NTV Telugu

PM Pedro Sanchez: యూపీఐ ద్వారా గణేషుడి విగ్రహాన్ని కొనుగోలు చేసిన స్పెయిన్ ప్రధాని..

Spain Pm

Spain Pm

PM Pedro Sanchez: స్పెయిన్ ప్రధాని మూడు రోజులు పర్యటన కోసం భారతదేశం వచ్చారు. సి-295 మిలిటరీ ఎయిర్‌క్రాఫ్ట్‌లను భారతదేశంలో తయారు చేయడానికి టాటా అడ్వాన్స్‌డ్ సిస్టమ్ లిమిటెడ్-ఎయిర్‌బస్ ఫెసిలిటీని సోమవారం ప్రధాని నరేంద్ర మోడీ, స్పెయిన్ పీఎం శాంచెజ్ ఆవిష్కరించారు. ఈ ఫెసిలిటీలో తయారైన విమానాలను భవిష్యత్తులో ఎగుమతి చేయనున్నారు. భారతదేశంలో మేక్ ఇన్ ఇండియా ప్రోగ్రాంకి ఇది ఊతమిస్తుందని ప్రధాని మోడీ అన్నారు.

Read Also: CM Revanth: కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావులపై సీఎం కీలక వ్యాఖ్యలు..

ఇదిలా ఉంటే, స్పెయిన్ పీఎం పెడ్రో శాంచెజ్ సోమవారం ఆయన భార్య బెగోనా గోమెజ్ తో కలిసి దీపావళి వేడుకల్లో పాల్గొన్నారు. భారతదేశంలోని ఆన్‌లైన్ లావాదేవీల పురోగతిని స్పెయిన్ పీఎం దగ్గరుండి పరిశీలించారు. మంగళవారం యూపీఐ చెల్లింపు విధానాన్ని ఉపయోగించి, గణేషుడి విగ్రహాన్ని కొనుగోలు చేశారు.

Exit mobile version