Site icon NTV Telugu

SP Leader Azam Khan: ఎస్‌పీ నేత ఆజంఖాన్‌కు రెండేళ్ల జైలు .. విద్వేషపూరిత ప్రసంగాల కేసులో శిక్ష ఖరారు

Azam Khan

Azam Khan

SP Leader Azam Khan: విద్వేషపూరిత ప్రసంగాల కేసులో సమాజ్ వాదీ పార్టీ నేత, మాజీ ఎమ్మెల్యే ఆజంఖాన్‌ను కోర్టు దోషిగా తేల్చింది. 2019 లోక్ సభ ఎన్నికలకు ముందు ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ పై చేసిన వ్యాఖ్యలకు గాను రాంపూర్ ఎంపీ-ఎమ్మెల్యే కోర్టు ఆయనకు రెండేళ్ల జైలు శిక్ష విధించింది. 2019 లోక్ సభ ఎన్నికల నేపథ్యంలో నమోదైన విద్వేషపూరిత ప్రసంగాల కేసులో యూపీకి చెందిన సమాజ్ వాదీ పార్టీ సీనియర్ నేత ఆజంఖాన్ కు రాంపూర్ ఎంపీ-ఎమ్మెల్యే కోర్టు రెండేళ్ల జైలు శిక్ష విధించింది. ప్రస్తుతం ఆజం బెయిల్ పై బయట ఉన్నారు. గత ఆరు నెలల్లో అజాంఖాన్‌ దోషిగా తేలిన మూడో కేసు ఇది. అయితే మూడు కేసుల్లో ఒకదానిలో కింది కోర్టు తీర్పుపై ఆయన అప్పీల్ కు అనుమతి లభించడంతో ఆయన నిర్దోషిగా విడుదలయ్యారు.

Read also: Tamilnadu: మీ కోరికలు వెంటనే తీరాలంటే ఈ గుడికి ఒక్కసారి వెళ్ళాల్సిందే..!

విద్వేషపూరిత ప్రసంగాల కేసులో ఆజంఖాన్ ను కోర్టు దోషిగా తేల్చింది. ఆ తర్వాత కోర్టు ఆయనకు (ఆజంఖాన్) రెండేళ్ల జైలు శిక్షతో పాటు జరిమానా కూడా విధించింది. 2019 ఏప్రిల్ 8న రాంపూర్ లోని షాజద్ నగర్ పోలీస్ స్టేషన్ లో ఈ కేసు నమోదు అయ్యింది. మిలాక్ విధానసభ ప్రాంతంలో జరిగిన బహిరంగ సభలో ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి (యోగి ఆదిత్యనాథ్), రిటర్నింగ్ అధికారిగా ఉన్న అప్పటి రాంపూర్ జిల్లా మేజిస్ట్రేట్ లను లక్ష్యంగా చేసుకుని ఆజం రెచ్చగొట్టే ప్రసంగం చేశారని ఫిర్యాదులో పేర్కొన్నారు.

Read also: Tamilnadu: మీ కోరికలు వెంటనే తీరాలంటే ఈ గుడికి ఒక్కసారి వెళ్ళాల్సిందే..!

2019 లోక్ సభ ఎన్నికల ప్రచారంలో బహుజన్ సమాజ్ పార్టీ, సమాజ్ వాదీ పార్టీలు కూటమిగా పోటీ చేసినప్పుడు ఈ ప్రసంగం చేశారు. ఆయన రాంపూర్ లోక్ సభ స్థానం నుంచి పోటీ చేసి బీజేపీ అభ్యర్థి, సినీ నటి జయప్రదపై విజయం సాధించారు. తరువాత రాష్ట్ర ఎన్నికల్లో ఎమ్మెల్యేగా ఎన్నికైన తర్వాత ఖాన్ తన లోక్ సభ సభ్యత్వానికి రాజీనామా చేశారు. గత ఏడాది మరో విద్వేషపూరిత ప్రసంగం కేసులో దోషిగా తేలడంతో ఆజంను రాష్ట్ర అసెంబ్లీ నుంచి అనర్హుడిగా ప్రకటించారు. రెండు రోజుల క్రితం ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం అజాంకు వై కేటగిరీ భద్రత అవసరం లేదంటూ ఉపసంహరించుకుంది. అయితే ఆయనకు వస్తున్న బెదింపుల నేపథ్యంలో రాంపూర్ పోలీసులు శుక్రవారం పలువురు పోలీసు సిబ్బందిని ఆయన భద్రత కోసం కేటాయించారు. 2017లో ఉత్తరప్రదేశ్ లో బీజేపీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి రాంపూర్ లో ఆజంఖాన్ పై భూకబ్జా, మోసం, క్రిమినల్ అతిక్రమణ సహా వివిధ అభియోగాలపై 81 కేసులు నమోదయ్యాయి.

Exit mobile version