Site icon NTV Telugu

Monsoon: వాన కబురు.. 2 రోజుల్లో కేరళను తాకనున్న నైరుతి రుతుపవనాలు

Imdmonsoon

Imdmonsoon

కేంద్ర వాతావరణ శాఖ దేశ ప్రజలకు చల్లని కబురు చెప్పింది. ఈ ఏడాది ఐదు రోజులు ముందుగానే.. అనగా మే 25న నైరుతి రుతుపవనాలు కేరళను తాకనున్నట్లు ఐఎండీ తెలిపింది. రాబోయే 2-3 రోజుల్లో నైరుతి రుతుపవనాలు ప్రారంభం అవుతాయని.. షెడ్యూల్ ప్రకారం సకాలంలో వస్తాయని సూచించింది. ఇక ఈ ఏడాది సాధారణం కంటే ఎక్కువ వర్షపాతం నమోదవుతుందని తెలిపింది. రుతుపవనాలు చురుగ్గా ఉండడం వల్ల వ్యవసాయం పనులు బాగుంటాయని పేర్కొంది. అంతేకాకుండా జలాశయాలు కూడా నిండుకుంటాయని వెల్లడించింది. ఇవన్నీ ఆర్థిక వృద్ధికి తోడ్పడతాయని స్పష్టం చేసింది.

ఇది కూడా చదవండి: US: హార్వర్డ్ యూనివర్సిటీపై ట్రంప్ సర్కార్ ఆంక్షలు.. విదేశీ విద్యార్థులకు చేర్చుకోవద్దని హుకుం

గతేడాది రుతుపవనాలు మే 30న వచ్చాయి. కానీ ఈ ఏడాది ఐదు రోజులు ముందుగానే వచ్చేస్తున్నాయి. అనుకూల పరిస్థితుల కారణంగానే రుతుపవనాలు త్వరగా వస్తున్నట్లు పేర్కొంది. 2-3 రోజుల్లో మాత్రం నైరుతి రుతుపవనాలు తాకడం ఖాయమని ఐఎండీ అంచనా వేసింది. ఇక భారతదేశానికి రుతుపవనాలు సకాలంలో రావడం చాలా కీలకమైన అంశం. వ్యవసాయ రంగం ఊపందుకుంటే ఆర్థిక రంగం మెరుగుపడుతుందని నిపుణులు అంచనా వేస్తున్నారు.

ఇది కూడా చదవండి: Kiran Abbavaram: తండ్రైన హీరో కిరణ్‌ అబ్బవరం!

2025 సంవత్సరానికి సగటు కంటే ఎక్కువ వర్షపాతం నమోదవుతుందని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. ఖరీఫ్ సీజన్ బలంగా ఉంటుందని, గ్రామీణ ఆదాయం, ఆహార భద్రత మరియు ఆర్థిక వృద్ధికి దోహదపడుతుందని ఆశలు రేకెత్తిస్తోంది. ముందస్తు వర్షాలతో వరి, మొక్కజొన్న, పత్తి, సోయాబీన్ మరియు నూనెగింజల విత్తడానికి తోడ్పడతాయని మరియు రబీ సీజన్‌కు ముందు జలాశయ స్థాయిలను పెంచుతాయని భావిస్తున్నారు.

కేరళతో పాటు దక్షిణ మరియు మధ్య అరేబియా సముద్రం, మాల్దీవులు మరియు కొమోరిన్ ప్రాంతం. లక్షద్వీప్, కర్ణాటక, తమిళనాడు, దక్షిణ మరియు మధ్య బంగాళాఖాతం, ఉత్తర బంగాళాఖాతం మరియు ఈశాన్య రాష్ట్రాలలోని కొన్ని ప్రాంతాలకు నైరుతి రుతుపవనాలు ఒక క్రమపద్ధతిలో ముందుకు సాగుతాయని ఐఎండీ అంచనా వేసింది.

ఇక దక్షిణ కొంకణ్-గోవా తీరంలో తూర్పు మధ్య అరేబియా సముద్రంపై అల్పపీడన వ్యవస్థ ఏర్పడినట్లు అంచనా వేసింది. రాబోయే 36 గంటల్లో ఉత్తరం వైపు కదులుతూ వాయుగుండంగా మారే అవకాశం ఉందని వాతావరణ బ్యూరో పేర్కొంది. పశ్చిమ తీరంలోని కొన్ని ప్రాంతాల్లో ఈదురుగాలులతో కూడిన వర్షం కురిసే అవకాశం ఉంది.

Exit mobile version