NTV Telugu Site icon

Heavy rain alert: పలు రాష్ట్రాలకు రెడ్ అలర్ట్ జారీ

Heavy Rain Alert

Heavy Rain Alert

దేశ వ్యాప్తంగా రుతుపవనాలు విస్తరించాయి. దీంతో ఇప్పటికే ఆయా రాష్ట్రాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. పలు రాష్ట్రాల్లో అయితే వరదలు ముంచెత్తుతున్నాయి. ఇప్పటికే పలువురు మృత్యువాత పడగా.. మరికొందరు నివాసాలు కోల్పోయి నిరాశ్రయులయ్యారు.

ఇది కూడా చదవండి: Kalki 2898 AD: ఐదు రోజులు 625 కోట్లు.. కల్కి అరాచకం!

ఇదిలా ఉంటే నైరుతి రుతుపవనాలు దేశవ్యాప్తంగా విస్తరించాయని ఐఎండీ తెలిపింది. దీంతో కేంద్ర వాతావరణ శాఖ పలు రాష్ట్రాలకు రెడ్ అలర్ట్ జారీ చేసింది. అరుణాచల్ ప్రదేశ్, అస్సాం, మేఘాలయ, గుజరాత్‌లో భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొంది. దీంతో ఈ రాష్ట్రాలకు రెడ్ అలర్ట్ ప్రకటించింది.

ఇది కూడా చదవండి: CM Revanth Reddy: మెగాస్టార్ చిరంజీవి సందేశం.. వీడియో విడుదల చేసిన సీఎం రేవంత్..

ఇక అరుణాచల్ ప్రదేశ్, అస్సాం, మేఘాలయ, ఉత్తరాఖండ్, పంజాబ్, ఉత్తరప్రదేశ్, బీహార్, సబ్-హిమాలయన్ పశ్చిమ బెంగాల్, సిక్కిం, నాగాలాండ్, మణిపూర్, మిజోరాం, త్రిపుర, గోవా, మహారాష్ట్ర, కర్ణాటకలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అంచనా వేసింది. అప్రమత్తంగా ఉండాలని ఐఎండీ సూచించింది.

ఇది కూడా చదవండి: Revanth Reddy: డ్రగ్స్ పై యుద్ధం.. సినీ పరిశ్రమకు సీఎం రేవంత్ రెడ్డి కండిషన్స్ ?