Sourav Ganguly: దాదాకు షాక్.. గంగూలీ భద్రతను తగ్గించిన బెంగాల్ ప్రభుత్వం

  • సౌరవ్ గంగూలీ భద్రత తగ్గించిన పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం
  • Z కేటగిరీ నుంచి Y కేటగిరీకి డౌన్‌గ్రేడ్
Sourav Ganguly

Sourav Ganguly

Sourav Ganguly: మాజీ క్రికెటర్ సౌరవ్ గంగూలీకి పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం భద్రతను తగ్గించింది. గంగూలీకి కల్పిస్తున్న Z- కేటగిరీని తగ్గించి, Y-కేటగిరీగా మార్చారు. భారత మాజీ కెప్టెన్ ఎదుర్కొంటున్న భద్రతాపరమైన ప్రమాదాలను జాగ్రత్తగా అంచనా వేసిన తర్వాత ఈ నిర్ణయం తీసుకున్నారు.

బెంగాల్ సర్కార్ 2023లో గంగూలీ భద్రతను ‘Z’ కేటగిరీకి అప్‌గ్రేడ్ చేసింది. అంతకు ముందు, భారత క్రికెట్ నియంత్రణ మండలి (బిసిసిఐ) మాజీ అధ్యక్షుడైన ఆయనకు రాష్ట్ర ప్రభుత్వం ‘Y’ కేటగిరీ భద్రతను కల్పించేది. భద్రత పెంచిన సమయంలో గంగూలీ నుంచి కానీ ఆయన వర్గం నుంచి కానీ అదనపు భద్రత కోసం ఎలాంటి అభ్యర్థన రాలేదు. అయినప్పటికీ అప్పటి బెంగాల్ ప్రభుత్వం మాత్రం ఆయనకు ‘జెడ్’ కేటగిరీ భద్రతను కల్పించింది. తక్కువ స్థాయి భద్రత సరిపోతుందని తాజా సమీక్షలో తేలడంతో ఆయన భద్రతను బీజేపీ సర్కార్ జెడ్ కేటగిరీ నుండి వై కేటగిరీకి తగ్గించింది.

×
×
Ad