NTV Telugu Site icon

MP Sanjay Raut: త్వరలో మహారాష్ట్ర సీఎంగా అజిత్ పవార్… ఎంపీ సంజయ్ రౌత్

Mp Sanjay Raut

Mp Sanjay Raut

MP Sanjay Raut: మహారాష్ట్ర ముఖ్యమంత్రి మళ్లీ మారుతారని శివసేన ఎంపీ సంజయ్‌ రౌత్ చెబుతున్నారు. ప్రస్తుతం ముఖ్యమంత్రిగా కొనసాగుతున్న ఏక్‌నాథ్‌ షిండే ముఖ్యమంత్రిగా దిగిపోయి.. ఆయన స్థానంలో అజిత్‌ పవార్‌ ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేయనున్నారని సంచనల వ్యాఖ్యలు చేశారు. ఏక్‌నాథ్‌ షిండే వర్గానికి చెందిన 16 మంది ఎమ్మెల్యేలపై అనర్మత వేటు పడనుందని తెలిపారు. నేషనలిస్ట్‌ కాంగ్రెస్‌ పార్టీ(ఎన్‌సీపీ)ని రెండు ముక్కలుగా చీల్చిన అజిత్‌ పవార్‌ తన వర్గం ఎమ్మెల్యేలతో కలిసి ఏక్‌నాథ్‌ షిండే ప్రభుత్వంతో చేతులు కలిపిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో నెలకొన్న తాజా పరిణామాలపై ఉద్ధవ్ ఠాక్రే నేతృత్వంలోని శివసేన ఎంపీ సంజయ్ రౌత్ సంచలన వ్యాఖ్యలు చేశారు. త్వరలో ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి మారబోతున్నారని చెప్పారు.

Read also: Anushka: నవ్వి నవ్వి ఏడుస్తారు… టిష్యూస్ తెచ్చుకోండి… మాములుగా ఉండదు

నేషనలిస్ట్‌ కాంగ్రెస్‌ పార్టీని రెండు ముక్కలుగా చీల్చిన అజిత్‌ పవార్‌ తన వర్గం ఎమ్మెల్యేలతో కలిసి ఏక్‌నాథ్‌ షిండే ప్రభుత్వంతో చేతులు కలిపిన విషయం తెలిసిందే. అందుకు ప్రతిఫలంగా మహా సీఎం ఏక్‌నాథ్‌ షిండే అజిత్‌పవార్‌కు ఉపముఖ్యమంత్రి పదవి కట్టబెట్టారు. అంతే కాకుండా పవార్‌ వర్గం ఎమ్మెల్యేలు తొమ్మిది మందిని తన క్యాబినెట్‌లోకి తీసుకున్నారు. ఈ అనూహ్య పరిణామాలతో మహరాష్ట్ర రాజకీయాల్లో ఒక్కసారిగా వేడి రాజుకుంది. ఎక్కడ చూసినా రాష్ట్రంలోని తాజా రాజకీయ పరిణామాల చర్చ సాగుతోంది. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో నెలకొన్న తాజా పరిణామాలపై ఉద్ధవ్ ఠాక్రే నేతృత్వంలోని శివసేన ఎంపీ సంజయ్ రౌత్ మాట్లాడుతూ మహారాష్ట్ర ముఖ్యమంత్రి మారబోతున్నారని చెప్పారు. ప్రస్తుత ముఖ్యమంత్రి ఏక్ నాథ్ షిండే స్థానాన్ని అజిత్ పవార్ భర్తీ చేస్తారంటూ వ్యాఖ్యానించారు. త్వరలో షిండే సహా 16 మంది ఎమ్మెల్యేలపై అనర్హత వేటు పడబోతోందని చెప్పారు.

Read also: MLA Vinay Bhaskar : తెలంగాణ కాంగ్రెస్ ఇవ్వలేదు, లాక్కున్నాం, గుంజుకున్నాం

ఈ రోజు కెమెరా ముందు ఈ విషయాన్ని చెబుతున్నాను.. మహారాష్ట్ర ముఖ్యమంత్రి మారబోతున్నారని.. ఏక్ నాథ్ షిండేను తొలగించబోతున్నారని చెప్పారు. ఏడాది క్రితం శివసేనలో చీలికలో భాగమైన షిండే సహా 16 మంది ఎమ్మెల్యేలు అనర్హులుగా మారబోతున్నారు. త్వరలో మహా సీఎంగా అజిత్ పవార్ నియమితులవుతారని రౌత్ వ్యాఖ్యానించారు. శివసేన, ఎన్సీపీ, కాంగ్రెస్ పార్టీలను బీజేపీ విచ్ఛిన్నం చేస్తోందని.. ఇలా చేయడం వల్ల బీజేపీకి ఎలాంటి ప్రయోజనం లేదన్నారు. 2024
సార్వత్రిక ఎన్నికల్లో మహారాష్ట్రలో ఐక్యంగా పోరాడుతామని.. ఎన్సీపీ నేతలు అవినీతికి పాల్పడుతున్నారని ప్రధాని మోదీ చెప్పడం విస్మయానికి గురి చేస్తోందన్నారు. అవినీతికి పాల్పడుతున్నారని అన్న నేతలే ఇపుడు రాజ్ భవన్ లో ప్రమాణ స్వీకారం చేశారని సంజయ్‌ రౌత్ చెప్పారు.