Sonu Sood: యాక్టర్ సోనూ సూద్ దేశవ్యాప్తంగా నెటిజన్ల నుంచి ట్రోలింగ్‌కి గురవుతున్నాడు. కస్టమర్ రొట్టేలపై ఉమ్మేస్తున్న యువకుడికి మద్దతు తెలిపినందుకు నెటిజన్లు తీవ్రంగా ఫైర్ అవుతున్నారు. ఈ వీడియోను సోనూసూద్ ‘‘రాముడికి ఎంగిలి చేసిన పండ్లను తినిపించిన శబరి’’తో పోల్చడం మరింత వివాదాస్పదమైంది. ఈ వివాదం మొత్తం ‘‘కన్వర్ యాత్ర’’ రూల్స్‌తో మొదలైంది. ఉత్తర్ ప్రదేశ్, ఉత్తరాఖండ్ అధికారుల కన్వర్ యాత్ర మార్గాల్లోని ప్రతీ దుకాణదారుడు తన పేరు కనిపించేలా బోర్డు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. అయితే, దీనిపై సోనూసూద్ ట్వీట్ చేస్తూ, నేమ్ ప్లేట్ ఏర్పాటు చేయాలి దానిపై మానవత్వం ఉండాలంటూ కామెంట్స్ చేశారు.
దీనికి ప్రతిస్పందనగా ఓ నెటిజన్, హోటల్‌లో రొటీలు తయారు చేస్తున్న క్రమంలో యువకుడి వాటిపై ఉమ్మేయడానికి సంబంధించిన వీడియోను షేర్ చేశారు. దీనిపై సోనూ సూద్ స్పందిస్తూ.. ‘‘ శ్రీరాముడు శబరి ఎంగిలి చేసిన పండ్లను తిన్నాడు. కాబట్టి నేను ఆ రోటీలను ఎందుకు తినలేను..? హింసను అహింసతో ఓడించవచ్చు సోదరా. మానవత్వం చెక్కుచెదరకుండా ఉండాలి. జైశ్రీరాం’’ అని కామెంట్స్ చేశారు.
Read Also: R. Narayana Murthy: హాస్పిటల్ నుంచి డిశ్చార్జయిన ఆర్ నారాయణమూర్తి… శిరస్సు వంచి నమస్కారం!
దీనిపై నెటిజన్లు తీవ్రంగా స్పందిచారు. ‘‘ఉమ్మితో చేసిన రోటీలను సోనూసూద్‌కి పార్సల్ చేయాలి, తద్వారా సోదరభావం చెక్కుచెదరకుండా ఉంటుంది..’’ అని కామెంట్ చేశారు. మరొకరు ‘‘ మిమ్మల్ని మీరు ఇంతగా డిఫెండ్ చేసుకోకండి. తప్పుని కూడా మీరు ఒప్పు చేయడంలో బీజీగా ఉన్నారు’’అని ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘‘ యువకుడిని మాత శబరితో పోలస్తున్నాడు. మీమ్మల్ని మీరు రాముడు అనిపించుకోవండి.’’ అని మరో నెటిజన్ వ్యంగ్యంగా స్పందించారు.
మరొకరు ‘‘సోనూ సూద్ అర్థంలేని వ్యాఖ్యలు చేస్తున్నాడు. ఈ రోటీలు తయారు చేసేది శబరి కాదు, మీరు రామాుడు కాదు..? శబరి ప్రేమకు చిహ్నం, ఈ వ్యక్తి ద్వేషంతో ఉమ్మివేస్తున్నాడు’’ అని స్పందించారు. మరో నెటిజన్ ‘‘ శబరి శ్రీరాముడి భక్తురాలు, ఆమె ద్వేషంతో రాముడి పండ్లను అవిత్రం చేయలేదు. ఆమె అమాయకత్వంతో అవి తీపిగా ఉన్నాయా లేదా తెలుసుకునేందుకు వాటిని రుచి చూసి శ్రీరాముడికి ఇచ్చింది. ఈ వీడియోలో కనిపించే వ్యక్తి తన కస్టమర్లపై ప్రేమ చూపిండం లేదు, ఇతర మతాల పట్ల రోటీలపై ఉమ్మేస్తున్నాడు. అతడిని శబరితో పోల్చడంలో నువ్వు మూర్ఖుడివి’’ అని ఆగ్రహం వ్యక్తం చేశాడు.
हमारे श्री राम जी ने शबरी के झूठे बेर खाए थे तो मैं क्यों नहीं खा सकता
हिंसा को अहिंसा से पराजित किया जा सकता है मेरे भाई🤍
बस मानवता बरकरार रहनी चाहिए ।जय श्री राम🚩 https://t.co/uljActwMrR
— sonu sood (@SonuSood) July 20, 2024
थूक लगाई रोटी "सोनू सूद" को “पार्सल” की जाये, ताकि भाईचारा बना रहे ! https://t.co/e3mghsFgkG pic.twitter.com/ANcE6yquTJ
— Sudhir Mishra 🇮🇳 (@Sudhir_mish) July 19, 2024