Sonia Gandhi: ‘ఎక్స్’లోకి ఎంట్రీ.. రాజీవ్‌తో తొలి భేటీ వివరాలు పంచుకున్న సోనియాగాంధీ
- ‘ఎక్స్’లోకి ఎంట్రీ ఇచ్చిన సోనియాగాంధీ
- రాజీవ్‌తో తొలి భేటీ వివరాలు పంచుకున్న సోనియా
- ఇటీవలే ఇన్‌స్టాగ్రామ్‌లోకి అడుగుపెట్టిన సోనియా
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కాంగ్రెస్ అగ్ర నాయకురాలు, కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ ఛైర్పర్సన్ సోనియా గాంధీ ఇటీవల ఇన్‌స్టాగ్రామ్‌లోకి అడుగుపెట్టారు. తొలి పోస్ట్‌గా ‘బిలాంగింగ్ – ఎ జర్నీ ఆఫ్ లవ్’ అనే పుస్తకంలోని ఒక వీడియోను పంచుకున్నారు. తాజాగా మరో సోషల్ మీడియా వేదిక ‘ఎక్స్’లోకి కూడా ప్రవేశించారు. ఈ సందర్భంగా దివంగత మాజీ ప్రధాని రాజీవ్ గాంధీతో ఏర్పడిన తొలి పరిచయాన్ని సోనియాగాంధీ పంచుకున్నారు. వీడియోలో రాజీవ్ గాంధీతో తొలి భేటీ, తొలిరోజులు, వారి ప్రేమాయణం గురించి వివరించారు. సోనియా గాంధీ రచించిన ‘బిలాంగింగ్ – ఎ జర్నీ ఆఫ్ లవ్’ పుస్తకం నవంబర్ 10న విడుదల కానుంది. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
దాదాపు రెండు నిమిషాల నిడివి గల ఎక్స్ వీడియోలో రాజీవ్ గాంధీ కేంబ్రిడ్జ్‌లో ఎలా కలుసుకున్నారో సోనియా గాంధీ వివరించారు. మొదటిసారి కలుసుకున్న రెస్టారెంట్ ఫొటోలను కూడా చూపించారు. ‘నా ప్రేమ ప్రయాణం కేంబ్రిడ్జ్‌లోని ఒక చిన్న గ్రీక్ రెస్టారెంట్లో మొదలైంది. నేనూ, రాజీవ్ ప్రేమ, నవ్వులు, జ్ఞాపకాలతో నిండిన ఒక ప్రపంచాన్ని సృష్టించుకున్నాం. నవంబర్ 10న నేను ఆ ప్రపంచాన్ని మీతో పంచుకోబోతున్నాను.’’ అని రాసుకొచ్చారు.
Also Read
- Sonia Gandhi Love story: రాజీవ్ గాంధీతో మొదటి చూపులోనే ప్రేమ.. తమ లవ్‌స్టోరీపై సోనియా గాంధీ ఆసక్తికర వ్యాఖ్యలు..
- Railway Group D Recruitment 2026: నిరుద్యోగులకు రైల్వే శాఖ శుభవార్త.. 30 వేల పోస్టులతో నోటిఫికేషన్..!
- Rahul Gandhi: పండుగల సమయం.. ర్యాలీ వాయిదా వేయండి.. రాహుల్‌గాంధీకి వ్యాపారుల విజ్ఞప్తి
- Minister Aadhav Arjuna vs Dhanush: హీరో ధనుష్‌పై టీవీకే మంత్రి సంచలన వ్యాఖ్యలు.. మాకు తెలియదనుకుంటున్నావా..?
వీడియోలో ఫొటోలను చూపిస్తూ రాజీవ్ గాంధీ చాలా ఆకర్షణీయమైన, సౌమ్యుడైన వ్యక్తిగా అభివర్ణించారు. ఆ రోజుల్లో ఇంగ్లాండ్‌లో ఆహారం అసలు బాగోలేదన్నారు. ఈ రోజు ఉన్నన్ని రెస్టారెంట్లు అప్పట్లో లేవని చెప్పారు. ఇటాలియన్ ఆహారం కోసం ప్రత్యేకంగా వెతికినట్లు తెలిపారు. తినడానికి మంచి రెస్టారెంట్ కోసం వెతుకుతున్నప్పుడు తనకు వర్సిటీ రెస్టారెంట్ కనిపించిందని.. అక్కడే తాను, మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ కలుసుకున్నామని చెప్పారు.
తొలి చూపులోనే ప్రేమ
తొలిసారి రాజీవ్ గాంధీని కలిసినప్పుడు తన జీవితాన్ని ఆయనతో గడపాలని వెంటనే అనిపించిందని గుర్తుచేశారు. రాజీవ్ గాంధీకి కూడా అలాంటి భావనలే ఉండేవని స్పష్టం చేశారు. తామిద్దరం ఒక ఉమ్మడి స్నేహితుడి ద్వారా కలుసుకున్నట్లు చెప్పారు. అనంతరం క్రమంగా స్నేహితులం అయినట్లు పేర్కొన్నారు. పార్టీలకు వెళ్లడం.. స్నేహితులతో కలిసి సరదాగా గడిపేవారని.. చాలా మంది విద్యార్థులతో కలిసి ఒక వాలెంటైన్స్ డే పార్టీకి కూడా హాజరయ్యారని గుర్తుచేశారు. రాజీవ్ గాంధీ స్వభావరీత్యా చాలా సౌమ్యుడని, ఆయన వ్యక్తిత్వం చాలా ఆకర్షణీయంగా ఉండేదని అన్నారు. ఈ సరళత, సౌమ్యత తనకు ఎంతో నచ్చే విషయమని తెలిపారు. రాజీవ్ గాంధీతో తన తొలి సమావేశాన్ని తాను ఎప్పటికీ మరచిపోలేనని సోనియాగాంధీ వెల్లడించారు.
In a small Greek restaurant in Cambridge my journey of love began.
Rajiv and I created a world filled with love, laughter and memories. On 10th November, I share that world with you. https://t.co/zvN5Rqqstf
— Sonia Gandhi (@SoniaGandhi) October 24, 2026
తాజావార్తలు
-
Vangaveeti Radha: ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన వంగవీటి రాధా.. లైట్ తీసుకుంటా..!
-
Sonia Gandhi Love story: రాజీవ్ గాంధీతో మొదటి చూపులోనే ప్రేమ.. తమ లవ్‌స్టోరీపై సోనియా గాంధీ ఆసక్తికర వ్యాఖ్యలు..
-
Bottle Gourd Roti Recipe: సొరకాయతో టేస్టీ రోటీలు.. బ్రేక్‌ఫాస్ట్‌కు అదిరిపోయే హెల్తీ రెసిపీ..
-
Ambati Rambabu: ఈసీపై అంబటి తీవ్ర ఆరోపణలు.. టీడీపీకి అనుకూలంగా నిర్ణయాలా..?
-
Parvath Anurag: మా రౌడీని ప్రేమించవచ్చు, ద్వేషించవచ్చు.. కానీ మర్చిపోలేరు!
ట్రెండింగ్
-
Shreyas Iyer History: మరో 25 పరుగులే.. మొదటి టీమిండియా కెప్టెన్‌గా శ్రేయస్ అయ్యర్ చరిత్ర!
-
LPG Gas Saving Tips: మీ గ్యాస్ సిలిండర్ త్వరగా అయిపోతోందా?.. ఈ చిన్న టిప్స్ పాటిస్తే ఎంతో ఆదా!
-
Used Tea Leaves: వాడేసిన టీ పొడిని పారేస్తున్నారా? ఆ చెత్తతో గాజు వస్తువులు మెరిపించవచ్చని తెలుసా?
-
Virat Kohli vs Pakistan: భారత్ – పాక్ సమరం.. జీవితంలో మరిచిపోలేని విరాట్ కోహ్లీ మాస్ ఇన్నింగ్స్..!
-
స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ జెన్ 5, యాక్టివ్ కూలింగ్ ఫ్యాన్‌తో OnePlus Ace 7 Pro.. అక్టోబర్ 29న గ్రాండ్ ఎంట్రీ..!