Site icon NTV Telugu

Sonia Gandhi: ఈడీకి సోనియా గాంధీ లేఖ.. మరింత సమయం ఇవ్వండి..

Sonia Gandhi

Sonia Gandhi

ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్‌కు లేఖ రాశారు కాంగ్రెస్‌ అధినేత్రి సోనియా గాంధీ.. కోవిడ్‌ బారిన పడడం.. కోలుకున్న తర్వాత పోస్ట్‌ కోవిడ్‌ సమస్యలతో ఇబ్బందిపడిన ఆమె.. ఆస్పత్రిలో చేరి చికిత్స తీసుకున్నారు.. ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్‌ అయి ఇంటికి చేరుకున్నా.. వైద్యుల సూచనల మేరకు ప్రస్తుతం విశ్రాంతి తీసుకుంటున్నారు. అయితే, నేషనల్‌ హెరాల్డ్‌కు సంబంధించి మలీలాండరింగ్‌ కేసులో ఈడీ విచారణకు ఆమె హాజరు కావాల్సి ఉన్న నేపథ్యంలో.. ఈడీకి లేఖరాసిన ఆమె.. విచారణను ప్రస్తుతం వాయిదా వేయాలని అభ్యర్థించారు.. ఈడీ ముందు హాజరయ్యేందుకు మరింత సమయం కావాలని లేఖలో కోరారు కాంగ్రెస్‌ అధినేత్రి సోనియా గాంధీ..

Read Also: Maharashtra Political Crisis: మహారాష్ట్రలో కొత్త ట్విస్ట్‌..

కాగా, సోనియాగాంధీ జూన్‌ 2వ తేదీన కోవిడ్‌ పాజిటివ్ నిర్ధారించారు. ఆ తర్వాత కోలుకున్నా.. కోవిడ్‌ సంబంధిత ఆరోగ్య సమస్యల కారణంగా ఆస్పత్రిలో చేరారు.. వారం రోజుల పాటు ఆసుపత్రిలో ఉన్న ఆమెను రెండు రోజుల క్రితం డిశ్చార్జ్ చేశారు వైద్యులు.. అయితే, కరోనా చికిత్స కారణంగా.. ఈడీ ముందుకు రాలేకపోయిన ఆమె.. ఇప్పుడు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ నుండి మరింత సమయం కోరారు.. జూన్ 8న ఆమె ఏజెన్సీ ముందు హాజరు కావాల్సి ఉన్నా.. సమయం కావాలంటూ ఆమె చేసిన అభ్యర్థనకు ఏజెన్సీ అంగీకరించింది. ప్రస్తుతం ఆమె విశ్రాంతిలో ఉన్న కారణంగా మరికొంత సమయం అడుగుతున్నారు. కాగా, నేషనల్ హెరాల్డ్‌ కేసులో ఇప్పటికే రాహుల్‌ గాంధీని ఐదు రోజుల పాటు ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ ప్రశ్నించిన విషయం తెలిసిందే.. ప్రతీరోజూ సుదీర్ఘంగా ఆయను ప్రశ్నించింది ఈడీ.. నేషనల్ హెరాల్డ్‌ కేసులో ఆయన చెప్పిన విషయాలను రికార్డు చేశారు. ఇక, సోనియా గాంధీ విచారణకు వెళ్లాల్సి ఉండగా.. మరోసారి సమయం కోరారు. ఆమె అభ్యర్థనపై ఈడీ ఎలా స్పందిస్తుంది.. సోనియా ఎప్పుడు ఈడీ ముందుకు వెళ్తారు అనేది వేచిచూడాలి. అయితే, ఈడీ నోటీసుల ప్రకారం.. సోనియా గాంధీ రేపు విచారణకు హాజరు కావాల్సి ఉంది.

Exit mobile version