President Droupadi Murmu: కాంగ్రెస్ తాత్కాలిక అధ్యక్షురాలు సోనియా గాంధీ మంగళవారం ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్‌లో నూతనంగా ఎన్నికైన భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ముతో సమావేశమయ్యారు. కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతున్న అంతర్గత విభేదాల మధ్య సోనియా గాంధీ రాష్ట్రపతిని కలిశారు. ప్రస్తుత కాంగ్రెస్ పార్టీ అంతర్గత విభేదాలతో అట్టుడికిపోతోంది.
Kishan Reddy: “వినాశ కాలే విపరీత బుద్ధి” అనే విధంగా కేసీఆర్ ప్రభుత్వ వ్యవహారం
ఇటీవల, కాంగ్రెస్ సీనియర్ నాయకుడు ఆనంద్ శర్మ రాష్ట్రానికి సంబంధించిన పార్టీ స్టీరింగ్ కమిటీ అధ్యక్ష పదవికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. తనను పదే పదే అవమానించడంతో తనకు వేరే మార్గం లేకుండా పోయిందని ఆయన వాపోయారు. దీనితో ఆయనను శాంతింపజేయడానికి హిమాచల్ ప్రదేశ్ ఇన్‌ఛార్జ్ రాజీవ్ శుక్లాను శాంతింపజేయడానికి పంపారు. ఆనంద్ శర్మతో భేటీ అనంతరం శుక్లా సోనియా గాంధీని కలిసేందుకు ఢిల్లీ వెళ్లారు. ఇటీవల సోనియా గాంధీకి కొవిడ్-19 పాజిటివ్ అని తేలిన సంగతి తెలిసిందే.