కరోనా సెకండ్ వేవ్ సమయంలో.. ఓవైపు బ్లాక్ ఫంగస్.. మరోవైపు వైట్ ఫంగస్ కేసులు వెలుగు చూస్తున్నాయి.. బ్లాక్ ఫంగస్ కేసులు మాత్రం.. దేశవ్యాప్తంగా పెద్ద సంఖ్యలో బయటపడుతున్నాయి.. మృతుల సంఖ్య కూడా భారీగానే ఉంది. అయితే, బ్లాక్ ఫంగస్ చికిత్సను ఆయుష్మాన్ భారత్‌తో పాటు ఇతర ఆరోగ్య బీమా పథకాల్లో చేర్చాలని డిమాండ్ చేశారు కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ. ఇవాళ ప్రధాని నరేంద్ర మోడీకి లేఖ రాసిన ఆమె.. ఎపిడెమిక్ డిసీజెస్ యాక్ట్ – 1897 ప్రకారం బ్లాక్ ఫంగస్ ఇన్‌ఫెక్షన్ (మ్యూకర్ మైకోసిస్)ను అంటు వ్యాధిగా గుర్తించాలని, ఆ కేసుల వివరాలను ఎప్పటికప్పుడు తెలియజేయాలని.. కేంద్ర ప్రభుత్వం ఇటీవల అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు సూచించిన విషయాన్ని పేర్కొన్న ఆమె.. బ్లాక్ ఫంగస్ చికిత్సకు అవసరమైన మందుల కొరత ఉన్నట్టు తన దృష్టికి వచ్చిందని.. వాటిని ఉత్పత్తి చేసి, సరఫరా చేసేందుకు చర్యలు తీసుకోవాలని.. రోగుల సంరక్షణకు ఉచిత సేవలు అందించాలని కోరారు.. కాగా, ఏపీ లాంటి రాష్ట్రం ఇప్పటికే బ్లాక్ ఫంగస్‌ను ఆరోగ్యశ్రీలో చేర్చిన సంగతి తెలిసిందే.
బ్లాక్ ఫంగస్‌ను ఆయుష్మాన్ భారత్‌లో చేర్చండి..!
sonia modi