NTV Telugu Site icon

Sonia Gandhi: ఆస్పత్రి నుంచి సోనియా గాంధీ డిశ్చార్జ్

Soniagandhi

Soniagandhi

రాజ్యసభ సభ్యురాలు, కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ చైర్‌పర్సన్ సోనియా గాంధీ ఢిల్లీలోని సర్ గంగా రామ్ ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. గురువారం ఆమె అస్వస్థతకు గురయ్యారు. దీంతో నిన్న ఉదయం ఢిల్లీలోని గంగా రామ్ ఆసుపత్రిలో చేరారు. పొత్తి కడుపు సంబంధిత సమస్యతో గురువారం ఉదయం ఆసుపత్రిలో చేరినట్లు వైద్యులు తెలిపారు. ఆమె ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉన్నట్లు డాక్టర్లు వెల్లడించారు. ఆరోగ్యం కుదిటపడడంతో శుక్రవారం మధ్యాహ్నం డిశ్చార్జ్ చేశారు. గతేడాది డిసెంబర్‌లో సోనియా 78 వ వసంతంలోకి అడుగుపెట్టారు.

ఇది కూడా చదవండి: Jagadish Reddy: కృష్ణా, గోదావరి జలాల్లో వాటాపై మాజీ మంత్రి సంచలన వ్యాఖ్యలు..

గతేడాది ప్రత్యక్ష రాజకీయాల నుంచి తప్పుకున్నారు. లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేయకుండా రాజస్థాన్ నుంచి రాజ్యసభ సభ్యురాలిగా ఎన్నికయ్యారు. ఇక ఆమె కుమార్తె ప్రియాంకాగాంధీ కూడా ప్రత్యక్ష రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చారు. వయనాడ్ ఎంపీగా పోటీ చేసి విజయం సాధించారు. ఇక కుమారుడు, లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ రాయ్‌బరేలీ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు.

ఇది కూడా చదవండి: Matrimonial Sites: మ్యాట్రిమోనియల్ వెబ్‌సైట్‌లే టార్గెట్.. పెళ్లి పేరుతో 15 మందిపై లైంగిక వేధింపులు