NTV Telugu Site icon

Bangladesh: బంగ్లాదేశ్‌లో ఏదో జరుగుతోంది.. హసీనా రీఎంట్రీకి రంగం సిద్ధం..?

Trump Hasina

Trump Hasina

Bangladesh: బంగ్లాదేశ్‌లో ఏదో జరుగుతోంది.. రానున్న కొన్ని రోజుల్లో బంగ్లా రాజకీయాలు వేగంగా మారే అవకాశం కనిపిస్తోంది. ఇటీవల డొనాల్డ్ ట్రంప్ గెలిచిన తర్వాత షేక్ హసీనా తనను తాను ప్రధానిగా సంభోదిస్తూ ఆయనకు శుభాకాంక్షలు తెలిపింది. మరోవైపు ట్రంప్ గెలవడం ప్రస్తుతం బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వాధినేత మహ్మద్ యూనస్‌కి పెద్ద తన నొప్పిగా మారింది. మొదటి నుంచి ట్రంప్ వ్యతిరేకిగా యూనస్‌కి పేరుంది. ట్రంప్ గెలిచిన తర్వాత అతను కనీసం శుభాకాంక్షలు కూడా చెప్పలేదు. మరోవైపు షేక్ హసీనాకు, ట్రంప్‌తో మంచి సంబంధాలు ఉన్నాయి.

నిజానికి బంగ్లాదేశ్‌లో షేక్ హసీనాని గద్దె దించడానికి జో బైడెన్ నేతృత్వంలోని ప్రభుత్వం, అమెరికా డీప్ స్టేట్ పనిచేసిందనే ఆరోపణలు ఉన్నాయి. ఈ డీప్ స్టేట్ ట్రంప్‌ని కూడా తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఉంటుంది. మహ్మద్ యూనస్ బైడెన్, కమలా హారిస్‌కి అత్యంత సన్నిహితుడిగా చెప్పబడుతున్నాడు. ఇతడిని బంగ్లాదేశ్ ప్రభుత్వాధినేతగా చేసిందే జోబైడెన్ అనే వాదన ఉంది. ఈ పరిణామాలు దృష్టిలో పెట్టుకుంటే రానున్న కాలంలో బంగ్లాదేశ్ రాజకీయాలు చాలా మార్పులకు గురవుతాయనేది స్పష్టంగా తెలుస్తోంది.

Read Also: Delhi: హిందూ ఆలయాలపై దాడులు చేస్తే ఊరుకోం.. సిక్కుల భారీ నిరసన(వీడియో)

షేక్ హసీనా తిరిగి బంగ్లాదేశ్‌కి వెళ్లేందుకు రంగం సిద్ధమైనట్లు వినికిడి. దీనికి తోడు మహ్మద్ యూనస్‌పై అంతర్జాతీయ క్రిమినల్ న్యాయస్థానం(ఐసీసీ)లో ఫిర్యాదు నమోదైంది. ఈ వారం బంగ్లా ఆర్మీ చీఫ్ భారత్‌కి రావడం కూడా ప్రాధాన్యత సంతరించుకుంది. మరోవైపు షేక్ హసీనా పార్టీ అవామీ లీగ్ బంగ్లాదేశ్ వ్యాప్తంగా నిరసనలకు పిలుపునిచ్చింది. అక్కడి రాడికల్ ఇస్లామిక్ గ్రూపులతో అవామీ లీగ్ కార్యకర్తలు, మద్దతుదారులు పోరాడుతున్నారు. ఈ పరిణామాలు చూస్తే త్వరలోనే బంగ్లాదేశ్‌లో యూనస్ ప్రభుత్వం పడిపోతుందనే భావన కలుగుతోంది.

యూనస్ అధికారంలోకి వచ్చిన తర్వాత బంగ్లాదేశ్‌లో మైనారిటీలైన హిందువులు, క్రిస్టియన్స్, బౌద్ధులపై దాడులు జరిగాయి. ఈ దాడులను ఇటీవల ట్రంప్ తీవ్రంగా ఖండించారు. యూనస్ అధికారంలోకి వచ్చిన తర్వాత అక్కడి తాత్కిలిక ప్రభుత్వంలోని ముఖ్యులు భారత్, ప్రధాని మోడీకి వ్యతిరేకంగా, ఓ విధంగా చెప్పాలంటే బెదిరింపులకు పాల్పడుతున్నారు. ఈ పరిణామాలన్నింటిని భారత్ గమనిస్తోంది. బంగ్లాలోని తీవ్రవాద గ్రూపులు షేక్ హసీనాను తమకు అప్పగించాలని భారత్‌ని బెదిరించే ధోరణిలో మాట్లాడుతున్నారు. ఇక ట్రంప్ రావడంతో భారత్ ఇక బంగ్లాలో తన గేమ్ ప్రారంభిస్తుందని తెలుస్తోంది.

Show comments