NTV Telugu Site icon

PM Modi: ‘‘నెహ్రూ టైంలో పావు వంతు, ఇందిరా టైంలో రూ. 10 లక్షల టాక్స్’’..

Pm Modi

Pm Modi

PM Modi: కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్‌పై విమర్శలు గుప్పిస్తున్న కాంగ్రెస్‌పై ప్రధాని నరేంద్రమోడీ విరుచుకుపడ్డారు. బీజేపీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్‌ 2025లో పన్ను మినహాయింపుల గురించి మాట్లాడారు. బుధవారం ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ప్రచారానికి చివరి రోజు కావడంతో ప్రధాని మోడీ ప్రచారం చేశారు. మాజీ ప్రధానులు జవహర్ లాల్ నెహ్రూ, ఇందిరా గాంధీ సమయంలో పన్నుల విధానం గురించి విమర్శించారు. నెహ్రూ కాలంలో ఎవరికైనా రూ. 20 లక్షల జీతం ఉంటే పావు వంతు పన్ను కట్టాల్సి వచ్చేదని, ఇందిరాగాంధీ సమయంలో రూ. 12 లక్షలకు రూ. 10 లక్షలు ప్రభుత్వం పన్నుగా వసూలు చేశారని ప్రధాని విమర్శించారు.

Read Also: Delhi Red Fort: ఎర్రకోట రంగును ఎవరు మార్చారు.. అంతకు ముందు ఏ రంగులో ఉండేది ?

10-12 ఏళ్ల క్రితం కాంగ్రెస్ పాలనలో రూ. 12 లక్షల జీతం ఉంటే రూ. 2.6 లక్షలు పన్నులుగా వసూలు చేసేదని, నిన్న బీజేపీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో రూ. 12 లక్షలు సంపాదించే వారు ఒక్క రూపాయి కూడా పన్ను చెల్లించాల్సిన అవసరం లేదకుండా చేశామని చెప్పారు. దక్షిణ ఢిల్లీలోని ఆర్కే పురంలో జరిగిన ర్యాలీలో ప్రధాని మోదీ మాట్లాడుతూ, మధ్యతరగతిని గౌరవించే, నిజాయితీగల పన్ను చెల్లింపుదారులకు బహుమతులు ఇచ్చే ఏకైక పార్టీ బిజెపి అని అన్నారు. నిన్నటి బడ్జెట్‌ని మొత్తం మధ్యతరగతి వర్గం భారతదేశ చరిత్రలోనే స్నేహపూర్వక బడ్జెట్‌గా చెబుతోందని, భారతదేశంలో ప్రతీ కుటుంబం ఆనందంతో ఉందని ప్రధాని అన్నారు. ప్రధాని మోడీ చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్ ఎంపీ ప్రియాంకాగాంధీ ఎదురుదాడి చేశారు. ఆయన ఎల్లప్పుడు దేశ మొదటి ప్రధానిని నెహ్రూని సాకుగా నిందిస్తూనే ఉంటారని అన్నారు.